ఎన్టీఆర్ కోసం మల్లు స్టార్ హీరో.. మల్లు నీల్ ప్లానింగ్ చేంజ్ , ఎన్టీఆర్ కోసం మల్లు హీరో

కేజిఎఫ్ సినిమాలతో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే సినిమాలకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 05:57 PMLast Updated on: Feb 07, 2025 | 5:57 PM

Mallu Star Hero For Ntr

కేజిఎఫ్ సినిమాలతో ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇప్పుడు స్టార్ హీరోలతో చేసే సినిమాలకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. తన మైండ్లో ఉన్న ప్లానింగ్ ను పక్కగా ఇంప్లిమెంట్ చేసేందుకు.. ఈ స్టార్ డైరెక్టర్ రెడీ అవుతున్నాడు. నిర్మాతలు కూడా ఇతనికి ఉన్న ట్రాక్ రికార్డు చూసి, అతను ఏం చెప్పినా సరే ఓకే చేసేస్తున్నారు. ఇక హీరోలు కూడా ప్రశాంత్ నీల్ సినిమా అనగానే తమను తాము రెడీ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్, ఈ సినిమాను ఎలాగైనా సరే 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ కూడా గట్టిగానే కష్టపడుతున్నాడు. తన లుక్ కూడా కంప్లీట్ గా మార్చుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాడు. ఇక ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఆఫీషియల్ గా స్టార్ట్ అవుతుంది. ఒక మాస్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ ఎవరు అనేదానిపై క్లారిటీ రావటం లేదు. ఇక తన సినిమాలో మలయాళం స్టార్ యాక్టర్స్ కు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో కూడా మలయాళం స్టార్ హీరోను ఒక నెగిటివ్ పాత్ర కోసం తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

సలార్ సినిమాలో ప్రభాస్ కు ఆపోజిట్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్న ప్రశాంత్… ఈ సినిమాలో ఎన్టీఆర్ కు విలన్ గా ఒక స్టార్ హీరోని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వస్తున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో తోవినో థామస్ నెగిటివ్ రోల్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనిని ఒప్పించిన ప్రశాంత్, అందుకోసం భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు సమాచారం. మలయాళం మార్కెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు ప్రశాంత్.

కన్నడ విషయంలో కూడా ఇలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కన్నడలో ప్రశాంత్ కు స్టార్ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మలయాళం స్టార్ హీరో ను తీసుకుంటే కచ్చితంగా సౌత్ లో బాగా ప్లస్ అవుతుందని కూడా ప్లాన్ చేస్తున్నాడు. థామస్ కు తమిళంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే అతని వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంకా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను ఆల్మోస్ట్ ఫైనల్ చేసేసాడు. ఎన్టీఆర్ తో సినిమా కాబట్టి ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అటు ఎన్టీఆర్ కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ పై గట్టి ఫోకస్ పెట్టాడు.