మ్యాన్ ఆఫ్ మాస్ ఫాన్ తుఫాన్.. దేవర రేంజ్ లో చివరి 30 నిమిషాలు…
బేసిగ్గా హీరోలకి ఫ్యాన్స్ కామన్. కాని హీరోలకి మరో హీరో ఫ్యాన్ అవటం అరుదు.. అలాంటి అరుదైన అభిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం. తనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎన్టీఆర్ కోసం ఏదైనా కోసుకునే రేంజ్ అభిమానిగా ఎన్నో సార్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు.
బేసిగ్గా హీరోలకి ఫ్యాన్స్ కామన్. కాని హీరోలకి మరో హీరో ఫ్యాన్ అవటం అరుదు.. అలాంటి అరుదైన అభిమాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సొంతం. తనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఎన్టీఆర్ కోసం ఏదైనా కోసుకునే రేంజ్ అభిమానిగా ఎన్నో సార్లు తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఇప్పడు మెకానిక్ రాకీగా మారి, బాక్సాఫీస్ లో వసూళ్లకి రిపేర్లు చేసేందుకొచ్చాడు. వివాదాలకే వెల్ కమ్ చెప్పే తను, ఈ సారి వసూళ్లలకి వెల్ కమ్ చెప్పేందుకొచ్చాడు. అంతవరకు బానే ఉంది. విచిత్రం ఏంటంటే తన మెకానిక్ రాఖీ మూవీ సగం పూర్తయ్యేలోపు ట్విట్టర్ రివ్యూల పేరుతో, డిజాస్టర్ అన్నారు. అలాంటి కామెంట్లు చేసిన బ్యాచే, సినిమా పూర్తయ్యాట ఆ ట్వీట్లు పూర్తిగా తీసేశారు.. ఇంతకి ఏమైంది? సినిమా హిట్టా ..?షాకా?…? అసలు ఈ ట్రోలింగ్ కి బ్రేక్ పడటం వెనకున్న ట్విస్ట్ ఏంటి?
ఎన్టీఆర్ ని టీనేజ్ నుంచే ఫాలో అయ్యే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. తన సినిమాల ఆడియోఫంక్షన్స్ కి చీఫ్ గెస్ట్ గా కూడా తారక్ వెళ్లాడు. ఇలా ఒక స్టార్ కి మరో హీరో ఫ్యాన్ అవటం, ఆ రిలేషన్ షిప్ కొనసాగటం మాత్రం చాలా అరుదు… అలాంటి అరుదైన ఎన్టీఆర్ అభిమాని ఇప్పుడు మెకానిక్ రాకీగా వచ్చేశాడు
మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ తో కలిసి విశ్వక్ సేన్ చేసిన ప్రయోగం తాలూకు కథ విషయానికొస్తే… అనగనగా ఒక గ్యారేజ్ దాన్ని కబ్జా చేయాలనుకునే విలన్… దాన్ని అడ్డుకుని తాతల కాలం నాటి గ్యారేజ్ కోసం రిస్క్ చేసే హీరో… ఈ పాయింట్ తోనే మెకానిక్ రాఖీ మూవీ వచ్చింది.
వినటానికే కాదు, చూడ్డానికి కూడా మెకానిక్ రాఖీ పరమ రొటీన్ కథే… విచిత్రం ఏంటంటే అదే రొటీన్ కథని, అంతకంటే రొటీన్ గా ఆసక్తి తగ్గేలా ప్రేక్షకుని సహనం పోయేలా తీశాడు డైరెక్టర్. అంతే దెబ్బకి విశ్వక్ సేన్ ని విమర్శించే బ్యాచ్, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా బ్యాచ్ ఇంటర్వెల్ బ్యాంగ్ పడకముందే, సోషల్ మీడియాలో క్విక్ రివ్యూ ఇచ్చేసింది
మెకానిక్ రాకీ ఫ్లాప్ కాదు డిజాస్టర్ అని మొదటి ఆట సగం పూర్తయ్యేలోపు ట్వీట్లు వచ్చేశాయి. కట్ చేస్తే అక్కడే అసలు ఆట మొదలైంది. మెకానిక్ రాఖీ సెకండ్ హాఫ్ లో ని ట్విస్టులు, కథనం పరిగెత్తేవిధానం షాక్ ఇచ్చింది. ఇంత సేపు చూసింది ఈ సినిమానేనా అనే డౌటొచ్చేలా మెకానిక్ రాఖీలో కథ, కథనాలే కాదు హీరో పెర్పామెన్స్ కూడా పీక్స్ లో ఉంది
మీనాక్షి చౌైదరి పాత్ర పరిది తక్కువే, శ్రద్ధా శ్రీనాథ్ కూడా అలానే గ్లామర్ డోసుకే సరిపోతుందనుకన్నారు. కాని సెకండ్ హాఫ్ లోనే తన విశ్వరూపంచూపించింది. ఇక విశ్వక్ సేన్ కూడా గతంలో ధమ్కీలో కూడా ఇలాంటి ట్విస్టులే ఇచ్చినా, అక్కడి తో పోలిస్తే, ఇక్కడ మెకానిక్ రాకీ గా మలుపులు గెలుపువైపు అడుగువేసేలా ఛేసింది
ఎన్టీఆర్ దేవర రిలీజ్ కిముందు విడుదలై వసూల్ల వర్షం కురిపించాక కూడా కామెంట్లు, ట్రోలింగ్స్ ఆగనట్టు, మెకానిక్ రాకీకైతే థియేటర్స్ లోపలనుంచే ట్రోలింగ్ పెరిగిపోయింది. కాని ఆ ట్రోలింగ్స్, కామెంట్స్ కి కూడా థియేటర్స్ నుంచే సెకండ్ హాఫ్ కంటెంట్ తో బ్రేక్ పడేలా చేశాడు విశ్వక్ సేన్. ఈ వారం విడుదలైన మెకానిక్ రాఖీ, మ్యూజిక్ కాని, కెమెరా, ఎడిటింగ్ కాని ఓకే అనిపించుకుంటే, కథ, కథనాలు, హీరో ,హీరోయిన్ల పెర్ఫామెన్స్ మాత్రం మతిపోగొడుతోందనే టాక్ తెచ్చుకుంది. ఆల్ మోస్ట్ హిట్ టాకే వస్తోంది.