మ్యాన్ ఆఫ్ మాసెస్ “మైత్రి”.. రెబల్ గ్లోబల్ మైత్రి.. క్యా సీన్ హై..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. బడ్జెట్ 500 కోట్లు... ఇది కేవలం ఇనీషియల్ బడ్జెట్ మాత్రమే.. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత లెక్కలు మారొచ్చు..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 28, 2025 | 07:15 PMLast Updated on: Feb 28, 2025 | 7:15 PM

Man Of Masses Maithri Rebel Global Maithri Kya Seen Hai

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ డ్రాగన్. బడ్జెట్ 500 కోట్లు… ఇది కేవలం ఇనీషియల్ బడ్జెట్ మాత్రమే.. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత లెక్కలు మారొచ్చు..అలాంటి మూవీ తీసే నిర్మాత మరో మూవీ, అదే రేంజ్ బడ్జెట్ లో తీయాలంటే, ఇది రిలీజ్ అవ్వాలి. కాని ఇలాంటివి ఏకంగా 4 సినిమాలతో రిస్క్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు, అల్లు అరవింద్ నే మించిపోయారు. ఏకంగా బాలీవుడ్, కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ లకే షాక్ ఇస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని కలిపి రెండు వేల కోట్ల రిస్క్ చేస్తున్నారు. దీనికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యాడు. ఇంతకి 2 వేల కోట్ల నాలుగు స్థంబాలాట మైత్రీ మూవీ మేకర్స్ కి ఎలా సాధ్యమౌతోంది..? హావేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూవీ అంటేనే 500 కోట్ల పైనే పెట్టు బడి పెట్టాలి. 350 కోట్ల నుంచి 550 కోట్ల వరకు ప్రభాస్ కే రెమ్యునరేషన్ సమర్పించుకోవాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమా అంటే కూడా ఇంచుమించు ఇలానే బడ్జెట్ బారెడు ఉండాలి. పాన్ ఇండియా లెవల్లో 1000 కోట్ల వసూళ్లు రాబట్టే స్టామినా ఉన్న హీరోల రేంజ్, వాళ్ల సినిమాల బడ్జెట్ కూడా 500 కోట్ల నుంచి 650 కోట్ల వరకు పెట్టాల్సి వస్తోంది.సో ఇదే ఇప్పుడు పాన్ ఇండియా హీరోలనే కాదు, పాన్ ఇండియా నిర్మాతలని కూడా డిసైడ్ చేస్తోంది. మొన్నటి వరకు తమిళోల్ల బ్యానర్ లైకా అంటే 500 కోట్లకంటే ఎక్కువే బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే బ్యానర్ అన్నారు. శాండిల్ వుడ్ బ్యానర్ హోంబలే కూడా కేజీయఫ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది.

కాని ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి కటౌట్లలో 2 వేల కోట్లకు మించే బడ్జెట్ అంటే ఎవరైనా ఊహిస్తారా..? ఇదే జరుగుతోంది. బాలీవుడ్ లో తోపు నిర్మాణ సంస్థలైనా యష్ రాజ్ బ్యానర్ లో ఇలాంటి పరిస్థితి లేదు. కరణ్ జోహార్ బ్యానర్ ధర్మా ప్రొడక్షన్ కి ఇంత దమ్ము, అంత స్టామినా లేదు. తెలుగు లో టాప్ ప్రొడ్యూసర్స్ అనుకున్న అల్లు అరవింద్, దిల్ రాజు లు కూడా 2 వేల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమా తీసే రేంజ్ లేదు..కాని మైత్రీ మూవీ మేకర్స్ కి ఇది సాధ్యం అవుతోంది. అంత స్టామినా, అంతగా ఫినాన్షియల్ సపోర్ట్ వీళ్లకే ఎలా సాధ్యమౌతోంది. మొన్నటికి మొన్న వచ్చిన పుష్ప 2 1850 కోట్ల పైనే వసూళ్లొచ్చాయి. ఐటీ రైడ్స్ కూడా జరిగాయి.. సో ఆ పెట్టుబడే ఇలా ఇటు షిఫ్ట్ చేశారా అంటే, వసూళ్లన్నీ నిర్మాత జేబులోకే వచ్చే ఛాన్స్ తక్కువ. వసూల్ల లో షేర్ పంచుకుంటే, 1850 కోట్ల వసూళ్లలో ప్రొడ్యూసర్స్ కి హార్డ్ లీ 800 కోట్లొచ్చే చాన్స్ ఉందంటున్నారు.

ఏదేమైనా మైత్రీ మూవీ మేకర్స్ ఇండియాలోనే ఎవరికీ సాధ్యం కాని పనిచేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫౌజీ కి 700 కోట్లు ఖర్చు చేస్తోంది. రామ్ చరణ్ తో బుచ్చి బాబు తీస్తున్న పెద్ది మూవీకి 550 కోట్లు అలాట్ చేసింది. ఇక ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ కి 650 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. పవన్ , హరీష్ శంకర్ సినిమాకు9 350 కోట్ల బడ్జెట్ అని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే 2200 కోట్ల వరకు ఈ నాలుగు సినిమాలకే కేటాయించి, ఒకే సారి ఇన్ని పాన్ ఇండియా ప్రాజెక్టులు తీస్తోంది.. అన్నీ హిట్ గ్యారెంటీ ప్రాజెక్టులు కాబట్టి, ఇందులో రెండు వర్కవుట్ అయినా మొత్తం 2200 కోట్లు వెనక్కి వచ్చేస్తాయి. నాలుగు వర్కవుట్ అయితే 5 వేల కోట్ల నెంబర్స్ తో టాలీవుడ్ ట్రెండ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది.