Devara : గోవా ఫారెస్ట్ లో దేవర’ యాక్షన్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. అసలు అక్టోబర్ లోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2024 | 12:20 PMLast Updated on: Jun 17, 2024 | 12:20 PM

Man Of Masses Ntr Craziest Project Devara

 

 

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘దేవర’. అసలు అక్టోబర్ లోనే రావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ లోనే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ‘దేవర’ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ గురించి ఇప్పటికే పలు క్రేజీ అప్డేట్స్ అందించింది టీమ్. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ను చూడనటువంటి ఊర మాస్ అవతార్ ను ‘దేవర’లో చూపించబోతున్నాడట డైరెక్టర్ కొరటాల శివ.

ఇక.. లేటెస్ట్ గా గోవాలోని అటవీ ప్రాంతంలో ‘దేవర’కి సంబంధించి అద్భుతమైన యాక్షన్ ఘట్టాన్ని పూర్తిచేశారట. హీరో ఎన్టీఆర్, విలన్ సైఫ్ ఆలీ ఖాన్ మధ్య చిత్రీకరించిన ఈ సీక్వెన్స్ చాలా బాగా వచ్చిందని చెబుతూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అయితే.. ఈ సీక్వెన్స్ ను తెరకెక్కించడానికి చిత్రబృందం చాలా కష్టపడిందట. భారీ వర్షాలు, బ్యాడ్ వెదర్ లో షూట్ ను పూర్తిచేశారట. ఈ యాక్షన్ పార్ట్ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసేందుకు సహకరించిన తన కెమెరా టీమ్, లైట్ టీమ్, స్టంట్ టీమ్ కు కృతఙ్ఞతలు తెలిపాడు స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.

‘దేవర’ సినిమా పై ఇప్పటికే ఎన్నో పుకార్లు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తాడని, సముద్రం మధ్యలో ఉండే ఓ దీవి నేపథ్యంలో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ భారీ యాక్షన్ తో సాగుతుందని తెలుస్తోంది. దేవర పార్ట్ 2 కూడా ఈ దీవి నేపథ్యంలోనే నడుస్తోందని తెలుస్తోంది. కాగా దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది.