మ్యాన్ ఆఫ్ మాసెస్ తీన్ మార్ … ఎన్టీఆర్ కి గ్రీక్ గాడ్ ఫిదా…
ఎన్టీఆర్ స్టెప్పేస్తే మాస్ ఫ్లోర్ ఊగిపోవాల్సిందే. క్లాసికల్ డాన్స్ టచ్ ఉన్న మాస్ హీరో టాలీవుడ్ లో చిరుతర్వాత ఎన్టీఆర్. ఓరకంగా ఇండియాలోనే క్లాసికల్ డాన్స్ టచ్ ఉండి, మాస్ ఫోలోయింగ్ ఉన్న హీరోలు కూడా మెగాస్టార్ చిరు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే...
ఎన్టీఆర్ స్టెప్పేస్తే మాస్ ఫ్లోర్ ఊగిపోవాల్సిందే. క్లాసికల్ డాన్స్ టచ్ ఉన్న మాస్ హీరో టాలీవుడ్ లో చిరుతర్వాత ఎన్టీఆర్. ఓరకంగా ఇండియాలోనే క్లాసికల్ డాన్స్ టచ్ ఉండి, మాస్ ఫోలోయింగ్ ఉన్న హీరోలు కూడా మెగాస్టార్ చిరు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆరే… కమల్ హాసన్ కి ఎంతగా క్లాస్ డాన్స్ మీద పట్టున్నా, తను క్లాస్ హీరోగానే మిగిలిపోయాడు. మాస్ పల్స్ పట్టుకోలేకపోయాడు. ఏదేమైనా ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి స్పీడ్ డాన్సర్ తో, బాలీవుడ్ గ్రీక్ గాడ్ లాంటి హ్రితిక్ రోషన్ కలిసి చిందేస్తే అన్న ప్రశ్న ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. కొరియోగ్రాఫర్లకి వెన్నులో వణుకు తెప్పిస్తోంది. ఇద్దరు డాన్స్ లో లివింగ్ లెజెండ్సే…. అలాంటి వీళ్ల కాంబినేషన్ లో సాంగ్ అంటే పాన్ ఇండియా లో పూనకాలే… త్రిబుల్ ఆర్ తో నాటు నాటు పాట ఎన్టీఆర్, చరణ్ కలిసి వేస్తేనే వరల్డ్ ఆడియన్స్ వరకు పూనకాలొచ్చాయి… మరి ఈ ఇధ్దరు కలిసి చేస్తున్ వార్ 2 లో అలాంటి సాంగే ప్లాన్ చేస్తే, ఫిల్మ్ మేకర్స్ కి అది చాలా పెద్ద ఛాలెంజ్…
ఎన్టీఆర్ స్టెప్పేస్టే ఫ్లోర్ షేక్ అవ్వాలి.. రిహార్సల్స్ అవసరం లేని హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. తనకోసం స్టెప్స్ కంపోజ్ చేయాలంటే కొరియోగ్రాఫర్లే కంగారుపడే పరిస్థితి… దీనికి తోడు తన డాన్స్ కి క్లాజ్ జనాలతో పాటు మాస్ లో పూనకాలొచ్చేంత ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి ఇమేజ్ హీరోలకి దక్కడం అరుదు..
రామ్ చరణ్, బన్నీ డాన్స్ లు చాలా క్లాస్ గా స్టైలిష్ గా ఉంటాయి… అందుకే క్లాస్ లో ఎక్కవ ఫాలోయింగ్ వీళ్ల సొంతం.. కాని క్లాస్ తోపాటు మాస్ లో కూడా భారీగాతారక్ డాన్స్ కి ఫాలోయింగ్ ఎక్కువ. దీనికి కారనం అతి భయంకరంగా స్పీడ్ డాన్స్ చేయటమే కాదు, పర్ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్స్ తో, ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్లోర్ స్టెప్స్ వేసేది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆరే..
కాబట్టే ఎన్టీఆర్ సాంగ్ అంటే వెండితెర వెలగాలి, థియేటర్ అమెరికాదైనా, అక్కడి ఇండియన్స్ పేపర్లు చింపి గాల్లో విసరాలీ… దేవర ఆడుతున్న అమెరికా థియేటర్స్ లో ఇలా ఫ్యాన్స్ చింపి విసిరిన కాగితాలు అక్కడి మీడియాలో వార్తల్లోకెక్కాయి.
అలాంటి క్రేజ్ ఉన్న ఈ హీరో తో బాలీవుడ్ గ్రీక్ గాడ్ కలిసి చిందేస్తే సెన్సేషనే… అసలే హ్రితిక్ అంటే బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాదు, కొరియోగ్రాఫర్ కమ్ హీరో ప్రభుదేవ రేంజ్ నే మించే డాన్సర్ అంటారు. అలాంటి ఈజ్ ఉన్న బాడీ లాంగ్వేజ్ తన సొంతం… ఒకప్పడు తన డాన్స్ కోసమే జనాలు థియేటర్స్ కెళ్లిన రోజులున్నాయి.
అలాంటి స్టార్ తో ఊర మాస్ స్టెప్పులతో పూనకాలు తెప్పించే తారక్ కలిసి చిందేస్తే వెండితెరమీద అను విస్పోటనమే… రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చిందేస్తే, ఆస్కారే సలామ్ కొట్టింది. నాటు నాటు పాట జనాల్లోకి తూటాలా దూసుకెల్లింది. ఇప్పుడు హిందీ మూవీ వార్ 2 సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ పాత్ర తాలూకు షూటింగ్ నవంబర్ లోగా పూర్తవుతుంది. డిసెంబర్ లో సాంగ్స్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది
ఆల్రెడీ సాంగ్స్ తాలూకు కొరియోగ్రఫీ, గణేష్ మాస్టర్, ప్రభుదేవ, రాజు సుందరం వార్ 2 సాంగ్స్ కి కొరియోగ్రాఫి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోసాంగ్ ని కంపోజ్ చేస్తూనే, ఎన్టీఆర్, హృతిక్ కలిసి డాన్స్ చేసే పాటకి స్టెప్స్ ని మాత్రం ముగ్గురు కొరియోగ్రాఫర్లు కష్టపడుతున్నారట. డిసెంబర్ లో షూటింగ్ అంటున్నారంటే, నవంబర్ ఎండ్ లోగా సాంగ్ కొరియోగ్రఫి పూర్తవుతుందని తెలుస్తోంది.