మ్యాన్ ఆఫ్ మాసెస్ VS అల్లు అర్జున్.. అరవ అడ్డాలో..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ ఆగస్ట్ 14 కి వస్తోంది. సలార్ సంక్రాంతిని టార్గెట్ చేస్తుందన్నారు. కాని అది సమ్మర్ కే వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్తితి చూస్తే ఇంతవరకు ఏ సినిమా ఫిక్స్ కాలేదు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 మూవీ ఆగస్ట్ 14 కి వస్తోంది. సలార్ సంక్రాంతిని టార్గెట్ చేస్తుందన్నారు. కాని అది సమ్మర్ కే వచ్చే ఛాన్స్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్తితి చూస్తే ఇంతవరకు ఏ సినిమా ఫిక్స్ కాలేదు. ఆట్లీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతూ ఆగుతూ, తూగుతూ సాగుతోంది. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలోనే ఉండిపోయింది. సో ఇప్పటికిప్పుడు ఈ రెండీంట్లో ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా ఎన్టీఆర్ మూవీతో పోటీ కొస్తుందనుకోలేం. కాని నిజంగానే ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరు పోటీ పడేది పాన్ ఇండియా లెవల్లో కాదు… టాలీవుడ్ మార్కెట్ లో అసలు పోటీకి ఛాన్సేలేదు.. కాని అరవ అడ్డాలో మాత్రం ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇది అఫీషియల్ ఎక్కడా కూడా రూమర్ లేదు, గాసిప్ కి ఛాన్సేలేదు. కాని ఇద్దరు తెలుగు హీరోలు అరవ అడ్డాలో పోటీ పడటమే వింతంటే, తోడుగా తమిళ హీరోలు రంగంలోకి దిగటం అంతకంటే వింత… సో విచిత్ర పోటీని కూడా చూసేయండి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ ని గెలిచాడు. రాజమౌళి సాయం లేకుండానే దేవర మూవీతో మరోసారి పాన్ ఇండియాని షేక్ చేశాడు. కాని ఒక్కదగ్గర మాత్రం వెనకబడ్డడాడు. అదే అరవ అడ్డా… తనే కాదు తెలుగు హీరోలంతా కోలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టడంలో ముందుడుగు వేయకపోవటానికి,తమిళ తంబీలు వాళ్ల హీరోలని తప్ప మరొకరి మూవీలను అంత ఇష్టంగా చూడరు.తెలుగు మూవీలే కాదు రియాలిస్టిక్ గా ఉండే మలయాళం మూవీలు కూడా అరవ అడ్డాలో అంతంత మాత్రంగానే ఆడుతాయి. అంతగా బావిలో కప్పలా వాళ్ల సినిమాలు, వాళ్ల హీరోలు, అన్నట్టు బ్రతికే వాళ్లని కూడా బాహుబలి, త్రిబుల్ ఆర్ మూవీలు థియేటర్స్ కి రప్పించాయి… కాని దేవర, పుష్ప రెండు భాగాలు కోలీవుడ్ లో సోసోగా ఆడాయి..
దేవర నార్త్ మాస్ ఆడియన్స్ ని కుదిపేసింది. పుష్ప రెండు భాగాలు కూడా అంతే… కాని విచిత్రం ఏంటంటే దేవర తెలుగు, కన్నడ, హిందీ లో దుమ్ముదులిపింది. మలయాళంలో మంచి వసూళ్లే రాబట్టింది. ఎటొచ్చి కోలీవుడ్ లోనే అరవ కరుడు గట్టిన ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. పుష్ప2 అయితే మరీ ఘోరం అక్కడ ఆల్ మోస్ట్ ఈ మూవీ ఫెయిలైంది. మాళీవుడ్ లో అల్లు అర్జున్ కి మల్లు అర్జున్ అనేంత పేరున్నా, పుష్ప2 మాలీవుడ్ లో డిజాస్టర్ గా తేలింది.సో కేరల ఎంత చిన్న మార్కెట్ అయినా దాన్ని ఎవరూ లైట్ తీసుకోలేదు. అలాంటిది తెలుగు తర్వాత అంత పెద్ద మార్కెట్ అయిన కోలీవుడ్ ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. అరవోళ్లు పొరుగు సినిమాలను, పొరుగు హీరోలను ఇష్టపడరనేది కొంతవరకు నిజమే.. కాని బాహుబలి, త్రిబుల్ ఆర్ ఎలా కోలీవుడ్ లో వసూళ్ల
వరద తెచ్చాయి… అందుకు అలాంటి మూవీకోసం అడుగు ముందుకేస్తున్నాడు ఎన్టీఆర్. తనలానే బన్నీ కూడా స్ట్రాటజీ మార్చాడు
అరవ అడ్డాలో తెలుగు హీరోల మధ్య పోటీ పోటెత్తేలా ఉంది. ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ లో తమిళ డ్రాగన్ ని దింపబోతున్నారట. మైత్రీ మూవీ మేకర్సే నిర్మించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ 100 కోట్లు రాబట్టింది. సో ఆ హీరోని డ్రాగన్ లో తమిళ తంబీగా చూపించాలనుకుంటున్నారట. ఇక మరో తమిళ హీరో శివ కార్తికేయన్ ని బన్నీ తో ఆట్లీ తీసే సినిమాలో స్పెషల్ రోల్ కి తీసుకుంటున్నారట. శివ కార్తికేయన్ కూడా ఆట్లీ ఆఫర్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సో అక్కడి హీరోలని తమ మూవీల్లో తీసుకుంటే అయినా మన సినిమా చూస్తరని ఇలా డ్రాగన్ లో అలానే బన్నీ మూవీలో అరవ హీరోలని తీసుకుంటున్నారు. ఈవిషయంలో కోలీవుడ్ మార్కెట్ కోసం మన హీరోలు పోటి పడుతున్నారు.