MANCHU MANOJ: కంగ్రాట్స్‌ బ్రో.. మంచు మనోజ్‌ తండ్రి అయ్యాడు

మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. గతేడాది చివర్లో మనోజ్.. తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 03:40 PMLast Updated on: Apr 13, 2024 | 3:44 PM

Manchu Manoj And Bhuma Mounika Reddy Blessed With A Baby Girl

MANCHU MANOJ: మంచు వారింట సంబరాలు మొదలయ్యాయి. మంచు మనోజ్ భార్య మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. “అలా వారు నలుగురు అయ్యారు.. దేవతల ఆశీర్వాదంతో.. ఇప్పుడు వాళ్ల జీవితంలోకి ఓ చిన్న దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం ఇప్పుడు తమ జీవితంలోకి వచ్చింది.

STUDENT SUCCESS: పెద్దల్ని, పెళ్లిని ఎదిరించింది.. విజేతగా నిలిచింది.. నువ్‌ సూపర్‌ తల్లీ..

మనోజ్‌ బిడ్డను MMపులి అని పిలుస్తాము. ఈ సంపూర్ణ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమతో వారిని ఆశీర్వదించండి” అంటూ ట్వీట్‌ చేసిన లక్ష్మీ. మంచు మనోజ్.. భూమా మౌనికను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే మౌనికకు పెళ్లి అయ్యి ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ఆ తరువాత భర్తకు విడాకులు ఇచ్చిన తరువాత మనోజ్ తో పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్ళింది. ధైరవ్ తనకు శివుడి ఇచ్చిన బహుమతి అని మనోజ్ అతనిని కూడా కొడుకుగా స్వీకరించాడు. ఇక గతేడాది చివర్లో మనోజ్.. తాను తండ్రి కానున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు మంచు వారింటికి కొత్త వారసురాలు వచ్చింది. రీసెంట్‌గా మంచు మనోజ్‌ తండ్రి అయ్యాడని వాళ్లకు కవల పిల్లలు పుట్టారని చాలా పుకార్లు వచ్చాయి.

కానీ అలాంటిది ఏం లేదని మంచు మనోజ్‌ స్వయంగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. అంత మంచి వార్తను తానే స్వయంగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటానని చెప్పాడు. అన్నట్టుగానే ఆడపిల్లకు తండ్రి అయ్యాడు మనోజ్‌. ఇప్పటికే అంచు విష్ణుకు ఇద్దరు ఆడపిల్లలు కాగా.. మంచు లక్ష్మీకి ఒక కూతురు ఉంది. ఇక మనోజ్ కూతురితో.. మంచు ఇంట నలుగురు మహాలక్ష్ములు ఉన్నట్టే అంటున్నారు మనోజ్‌ ఫ్యాన్స్‌.