Manchu Manoj: మంచు మనోజ్‌కు కవల పిల్లలు.. క్లారిటీ ఇచ్చిన మనోజ్
కొన్ని రోజుల నుంచి వీళ్లిద్దరి విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్-మౌనికకు కవలలు పుట్టారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ విషయం బయటికి చెప్పడంలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Manchu Manoj: రాక్ స్టార్ మంచు మనోజ్, భూమా మైనికారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి అయినప్పటికీ ఇరు కుటుంబాలు వాళ్ల పెళ్లి ఎంతో గ్రాండ్‌గా చేశాయి. మొదటి భర్తతో మౌనికకు ఓ బాబు ఉన్నా.. ఆ బాబును తన కొడుకుగానే స్వీకరించాడు మంచు మనోజ్. అయితే కొన్ని రోజుల నుంచి వీళ్లిద్దరి విషయంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
SSMB 29: మహేశ్ సీక్రెట్.. దాచిపెట్టలేకపోతున్నారా..?
మనోజ్-మౌనికకు కవలలు పుట్టారని.. కానీ కొన్ని కారణాల వల్ల ఈ విషయం బయటికి చెప్పడంలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంకొందరు మేధావులైతే ఏకంగా ఓ బిడ్డకు సీరియస్‌గా ఉంది.. మనోజ్ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాడు అంటూ కూడా యూట్యూబ్ వీడియోలు చేసి పెడుతున్నారు. దీంతో ఈ ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఈ విషయంలో మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నట్టు తమకు కవలలు పుట్టలేదని చెప్పాడు. ప్రస్తుతం మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. వాళ్లకు పుట్టబోయే పిల్లల విషయంలో తామెంతో సంతోషంగా ఆసక్తితో ఉన్నామంటూ చెప్పాడు. ఒకవేళ మౌనిక కవలలకు జన్మనిస్తే.. ఖచ్చితంగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటానని చెప్పాడు. ఎంతో కాలంగా తనపై తన కుటుంబ సభ్యులపై ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాడు.
ఇంత పెద్ద కుటుంబం తనకు దొరికినందుకు సంతోషంగా ఉందంటూ లెటర్ రిలీజ్ చేశాడు. దీంతో కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది. ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేసినవాల్లను సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు మంచు మనోజ్ ఫ్యాన్స్. ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో పాటు మౌనిక ప్రెగ్నెంట్ అని చెప్పడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి రాక్‌స్టార్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Grateful for your love and support over the years 🙏❤️ Please ignore unfounded rumors. Official news coming soon. Thank you for your continued understanding and affection. Love and gratitude to all 🙏🏼❤️ pic.twitter.com/GI1QtPYXRh
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 12, 2024