Mohan Babu: మంచు ఫ్యామిలీ గొడవల్లో ట్విస్ట్.. మరిన్ని వీడియోలతో షాక్ ..
మంచు మనోజ్ మొన్న పెట్టిన పోస్టు, దానికి తోడు మంచు విష్ణు తాలూకు వీడియో ఫ్యామిలీ గొడవల్ని పబ్లిక్ అయ్యేలా చేసింది. మంచు లక్ష్మీ, మోహన్ బాబు ఇద్దరూ ఈ గొడవను సద్దుమనిగేలా చేసి, డ్యామేజ్ కంట్రోల్ కి ప్రయత్నించారు. కాని ఈ వివాదం ఇంటివరకే పరిమితమయ్యేలా లేదు.

manchu mohan babu family
మంచు మనోజ్ దగ్గర మరిన్ని వీడియోలున్నాయని తెలుస్తోంది. అవి కూడా బయట పెట్టబోయిన తనని మోహన్ బాబు మందలించి ఆపాడని తెలుస్తోంది. ఇంతకి ఈ గొడవకి కారణం ఏంటంటే, విద్యాసంస్థలు, ఆస్తుల మీద అజమాయిషే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎన్నో ఏళ్లుగా ఈ మంచుబ్రదర్స్ మధ్య గొడవలున్నా, బయట పడలేదు. మంచు ఫ్యామిలీలో మనోజ్ ఒక్కడే మిగతా సమాజానికి దగ్గరగా మంచి వాడిగా ఫోకస్ అయ్యాడనే అభిప్రాయాలుండటంతో, సోషల్ మీడియాలో కూడా తనవైపే అందరి సానుభూతి పెరుగుతోంది. మా అసోసియేషన్ లో కూడా మంచు విష్ణు మీద రచ్చ జరిగేలా ఉంది. ఎందుకంటే తనని అన్న విష్ణు టార్గెట్ చేయటం వల్లే, మనోజ్ బరస్ట్ అవ్వటం జరిగిందట. ఇప్పుడు ఈ వివాదం, ఇంటినుంచి మా అసోసియేషన్ కి చేరిందట. దీంతో ఇది డైలీ సీరియల్ లా సాగే పరిస్థితులు ముందు ముందు రానున్నాయని తెలుస్తోంది.