మంచు విష్ణుకి నిద్ర లేకుండా చేస్తున్న అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్... ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ హీరో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 10:33 PMLast Updated on: Sep 09, 2024 | 10:33 PM

Manchu Vishnu Worried About Akshay Disasters

అక్షయ్ కుమార్… ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో ఈ హీరో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్నాడు. రాజకీయాల్లోకి వస్తాడని పంజాబ్ నుంచి బిజెపి తరుపున పోటీ చేస్తాడనే వార్తలు ఎన్నో వచ్చాయి. అతని సేవా కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాతనే అతనికి సేవా కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయని అంతకు ముందు ఎందుకు చేయలేదు అంటూ పలువురు ప్రశ్నించారు.

కెనడా కుమార్ అంటూ కూడా పలువురు అతన్ని పలువురు టార్గెట్ చేసారు. కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్… ఇండియా మీద సినిమాల కోసమే ప్రేమ చూపిస్తున్నాడనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అక్షయ్ కుమార్ దెబ్బకు బాలీవుడ్ నిర్మాతలు భయపడిపోతున్నారు. ఏకంగా 11 సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అక్షయ్ కుమార్ తో సినిమా చేయాలంటే కంగారు పడుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా 60 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఈ బాలీవుడ్ హీరో.

ఆయన నటించిన ఖేల్ ఖేల్ విడుదల కాగా అది 25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అదే రోజు విడుదల అయిన స్త్రీ 2 సినిమా ఏకంగా 700 కోట్లు విడుదల చేసింది. చిన్న చిన్న పాత్రలకు కూడా అతను కోట్ల రూపాయలు అడుగుతున్నాడు. మంచు విష్ణు నిర్మించి నటిస్తున్న కన్నప్ప సినిమాలో కేవలం 5 రోజులు నటించినందుకే రూ.6 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అసలే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న మంచు విష్ణూ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అలాంటి సమయంలో అక్షయ్ కుమార్ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు మంచు విష్ణుకి నిద్ర లేకుండా చేస్తుంది. అక్షయ్ కుమార్ ఏటా మూడు నాలుగు సినిమాలు చేస్తే అవి మినిమం గ్యారెంటీ సినిమాలుగా ఉండేవి. అలాంటిది ఇప్పుడు అతనితో సినిమా చేయడం అంటే సాహసం అనే పరిస్థితికి నిర్మాతలు వచ్చేశారు. ఓటీటీలో కూడా అతని సినిమాలకు స్పందన కరువు అయింది.