Kannappa : కన్నప్ప’లో మరో బిగ్ స్టార్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం 'కన్నప్ప' . ఈ పాన్ ఇండియా మూవీలో పలువురు బిగ్ స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 25, 2024 | 02:00 PMLast Updated on: Jun 25, 2024 | 2:00 PM

Manchu Vishnus Dream Project Kannappa

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’ . ఈ పాన్ ఇండియా మూవీలో పలువురు బిగ్ స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ప్రభాస్ , బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో అలరించనున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర తారాగణంలో మరో స్టార్ చేరినట్లు తెలుస్తోంది.

‘కన్నప్ప’ చిత్రంలో కోలీవుడ్ స్టార్ శింబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ పాత్రల తరహాలోనే.. కనిపించేది కాసేపే అయినప్పటికీ.. కథకి కీలకంగా, పవర్ ఫుల్ గా శింబు పాత్ర ఉంటుందట. త్వరలో శింబు నటిస్తున్న విషయాన్ని కన్నప్ప టీం అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

మొత్తానికి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ కోసం వివిధ భాషలకు చెందిన పలువురు స్టార్లను మంచు విష్ణు రంగంలోకి దింపుతున్నాడు. మరి ఆ స్టార్ల బలం తోడై.. పాన్ ఇండియా వైడ్ గా ‘కన్నప్ప’ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. కాగా ఈ సినిమాని క్రిస్మస్ కారణంగా డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.