Kangana Ranaut: ‘కన్నప్ప’లో పార్వతి దేవిగా ప్రభాస్‌ హీరోయిన్

ఇటీవలే న్యూజిలాండ్‌లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కన్నప్ప'లో మహాశివునిగా అతిథి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తుండగా.. పార్వతి పాత్రలో నటించబోయేది ఎవరన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2024 | 06:46 PMLast Updated on: Feb 21, 2024 | 6:46 PM

Manchu Vishnus Kannappa Prabhas As Lord Shiva And Kangana Ranaut As Parvathi Devi

Kangana Ranaut: టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప. ఈ చిత్రానికి మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాకు ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్ అనేది ఉప శీర్షిక. ఇటీవలే న్యూజిలాండ్‌లో సుదీర్ఘంగా తొలి షెడ్యూల్ జరుపుకున్న కన్నప్ప చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తొలి షెడ్యూల్‌లో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, శరత్ కుమార్ వంటి హేమాహేమీలపై సన్నివేశాలను చిత్రీకరించారు.

PRABHAS: కల్కి, రాజాసాబ్.. ఇద్దరూ డాన్స్ చేయాల్సిందే..

ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ కూడా నటిస్తుండడంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కన్నప్ప’లో మహాశివునిగా అతిథి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తుండగా.. పార్వతి పాత్రలో నటించబోయేది ఎవరన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. పార్వతి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనుందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్‌డేట్ ప్రకారం శివునిగా ప్రభాస్ నటించనుండగా.. పార్వతి దేవి పాత్రలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించనున్నట్లు చెప్తున్నారు.

ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారింది. ఇప్పటికే ప్రభాస్-కంగనా రనౌత్ జోడీ తెలుగులో ఏక్‌ నిరంజన్‌ సినిమాతో జత కట్టగా.. ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై అలరించనున్నారన్నది లేటెస్ట్‌ బజ్‌గా వినిపిస్తోంది. ఈ మూవీ అంతర్జాతీయ ప్రమాణాలతో, భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. పలు భారతీయ భాషల్లో విడుదల చేసేలా మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు.