మా మెంబర్స్ కు మంచు విష్ణు వార్నింగ్…!
ఇటీవల సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందన్నారు.
ఇటీవల సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని… హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి.. అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉందని విష్ణు గుర్తు చేసుకున్నారు. ప్రతీ ప్రభుత్వంతో పరిశ్రమ సత్సంబంధాలు కొనసాగిస్తోందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు వినతి, సున్నితమైన విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించొద్దని సభ్యుల వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకపోవడమే మంచిదని తెలిపారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు. అలాంటి అంశాలపై స్పందించడం వల్ల.. సంబంధిత వ్యక్తులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ‘మా’ సభ్యులకు ఐక్యత అవసరమన్నారు మంచు విష్ణు.