Mani Ratnam: ఆ పొగడ్తల వెనక కన్నింగ్ స్ట్రాటజీ.. మణిరత్నం మామూలోడు కాదు..?

మణిరత్నం పొన్నియన్ సెల్వం 2 ప్రీరిలీజ్ ఈవెంట్ లో పనికట్టుకుని రాజమౌళిని పొగిడాడు. తను లేకుండా పీఎస్ 1,2 రెండు ఉండేవే కాదన్నాడు. సౌత్ నార్త్ అడ్డుగోడలు కూల్చిన ఘనత జక్కన్నదే అన్నాడు. ఇది ఒకసారి కాదు, ఇలా తను అనటం రెండో సారి. ఐతే మణిరత్నం లాంటి డైరెక్టర్ రాజమౌళిని ఇలా ఆకాశానికి ఎత్తటం, అదే పనిగా పొగడటం వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఉన్నట్టుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2023 | 05:45 PMLast Updated on: Apr 24, 2023 | 5:45 PM

Mani Ratnam Prising Strategy

పొన్నియన్ సెల్వం 1 రిలీజ్ కి ముందు కూడా రాజమౌళిని పొగిడాడు మణిరత్నం. బాహుబలి లాంటి మూవీ రాకపోతే పొన్నియన్ సెల్వం ప్రాజెక్ట్ ఉండేది కాదన్నాడు. అంటే బాహుబలి తర్వాత బాహుబలి లాంటి మూవీలు తీసే ధైర్యం తమకొచ్చిందన్నాడు. అలా ఇండైరెక్ట్ గా పీఎస్ 2 కూడా తమిళ బాహుబలి అనేలా ప్రచారం చేసేశాడు

అంతేకాదు తెలుగు జనాన్ని అట్రాక్ట్ చేసేందుకు అటు రాజమౌళి, ఇటు బాహుబలి రెండు పేర్లు వాడేశాడు. అలా అయితే పొన్నియన్ సెల్వం2 తెలుగు జనాల్లోకి ఈజీగా దూసుకెళుతుందనే ఇలా జక్కన్న నామస్మరణ చేశాడనంటున్నారు. ఏదేమైనా అది బానే వర్కవుట్ అయ్యింది. కాని, మూవీలో మ్యాటర్ ఉంటేనే పార్ట్ 2 కి ఫలితం దక్కుతుంది.