Manjummel Boys: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
మంజుమ్మెల్ బాయ్స్ దాదాపు రూ.236 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఈ నెలలో తెలుగు డబ్బింగ్ కూడా విడుదలై.. ఇక్కడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
Manjummel Boys: ఈ ఏడాది అన్నింటికంటే ఎక్కువగా దూసుకెళ్తోంది మలయాళం ఫిలిం ఇండస్ట్రీ (మాలీవుడ్). ఈ ఏడాది మాలీవుడ్ నుంచి భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ది గోట్ లైఫ్ వంటి సినిమాలొచ్చాయి. వీటిలో ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ పాత రికార్డులు తిరగరాశాయి. అందులోనూ మంజుమ్మెల్ బాయ్స్ దాదాపు రూ.236 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, మలయాళ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
RAM CHARAN: చిరు, చరణ్‌కి ఆసక్తి ఉన్న కాలం కలిసిరాలేదా..?
ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఈ నెలలో తెలుగు డబ్బింగ్ కూడా విడుదలై.. ఇక్కడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయింది. మే 5 నుంచి మంజుమ్మెల్ బాయ్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ అధికారికంగా వెల్లడించింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుందని తెలిపింది. ఈ చిత్రం బడ్జెట్ పది కోట్ల రూపాయలలోపే ఉండటం విశేషం. అంత తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కి, ఇతర భాషల్లో కలిపి దాదాపు రూ.230 కోట్లు వసూలు చేసింది. అంటే.. పెట్టుబడికి 20 రెట్లకుపైగా లాభాలందించింది. చిన్న సినిమాల్లో వండర్‌గా నిలిచింది. 2008లో తమిళనాడులో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
సస్పెన్స్ థ్రిల్లర్, సర్వైవల్ జోనర్‌లో ఈ సినిమా రూపొందింది. విహార యాత్రకు వెళ్లిన స్నేహితుల బృందంలోని ఒక వ్యక్తి లోయలో పడిపోతే.. అతడిని ఎలా రక్షించారు అనేదే ఈ చిత్ర కథ. పూర్తి రియలిస్టిక్‌గా ఈ సినిమాను తీశారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.