Manjummel Boys: తెలుగులోకి మంజుమ్మల్ బోయ్స్.. మనవాళ్లకు నచ్చిందా..?

మలయాళం రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే మంజుమ్మల్ బాయ్స్‌లో ఉత్కంఠ, వేగం కాస్త ఎక్కువే ఉండటంతో, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్లొస్తే, తెలుగులో వందకోట్లు ఈజీగా రావొచ్చనే అభిప్రాయముంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 6, 2024 | 04:59 PMLast Updated on: Apr 06, 2024 | 4:59 PM

Manjummel Boys Telugu Version Released And Got Possitive Response

Manjummel Boys: మంజుమ్మల్ బోయ్స్ మలయాళంలో 200 కోట్లు రాబట్టిందని, మేకింగ్ బాగుందని, ఇలా చాలా కారణాలతో తెలుగులో సినిమాను రిలీజ్ చేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్క ముఖం కూడా ఇక్కడి జనాలకు తెలిసిందికాదు. ఐనా కంటెంట్ మీద నమ్మకంతో, ఆల్రెడీ హిట్ అయిన మూవీ కనుక ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. లక్కీగా పెద్దగా ప్రమోషన్ చేయకున్నా టాలీవుడ్ ఆడియన్స్‌లోకి ఈసినిమా వెళ్లింది. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఓ ఊరు, అందులో ఇద్దరు స్నేహితులు మిగతా ఫ్రెండ్స్ లానే చిన్నా చితకా పనులు చేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటారు.

VIVEKA WIFE : జగన్ కి కాంగ్రెస్ షాక్… పులివెందులలో సౌభాగ్యమ్మ పోటీ

చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా కలిసే జర్నీ చేస్తూ, ఉంటారు. వాళ్లకు మంజుమ్మల్ బోయ్స్ అనే గుర్తింపు కూడా ఉంటుంది. ఐతే ఈ మంజుమ్మల్ బోయ్స్ అంతా ఒకసారి కొడైకెనాల్ వెళతారు. కమల్ హాసన్ మూవీ గుణ ని షూటింగ్ చేసిన గుహల్ని చూస్తారు..కాని అందులో ప్రమాధకరమైన గుహలున్నాయని వెళ్లొద్దని ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కొన్ని దార్లుమూసేసినా వీళ్లు వెల్లటం, అందులో ఒక ఫ్రెండ్ లోయలో పడి చిక్కుకుపోతాడు. తన కోసం మంజుమ్మల్ బోయ్స్ ప్రాణానికి తెగించి ఏం చేశారు. ఇంతకి గుహలోని లోయలో పడ్డ ఫ్రెండ్ బ్రతికాడా అన్నదే కథ. రియల్‌గా జరిగిన ఓ ఇన్సిడెంట్‌నే సినిమాగా మలిచాడు డైరెక్టర్ షైజూ ఖలీద్. ఇందులో ఒక్కరంటే ఒక్కరి ముఖం కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. కాని అంతా పాత్రల్లో లీనమవ్వటం, డబ్బింగ్ క్వాలిటీ కూడా బాగుండటంతో, డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ తగ్గింది. ఇక కుట్టన్, సుభాష్ పాత్రల చుట్టూనే సినిమా అంతా చక్కర్లు కొడుతుంది. మనమే గుహలోని లోయలో పడిపోతే ఎలా ఫీల్ అవుతామో, అలాంటి ఫీలింగ్ కలిగేలా సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఉన్నాయి.

మామూలుగా మలయాళం మూవీల్లో ఉండే సాగతీత ఫీలింగ్, ఈ సినిమా కూడా చూస్తున్నంత సేపు కలుగుతుంది. కాని సెకండ్ హాఫ్‌లో గుహలో ఫ్రెండ్ పడిపోయే సీన్ వచ్చినప్పటి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. మొత్తంగా మలయాళం రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే మంజుమ్మల్ బాయ్స్‌లో ఉత్కంఠ, వేగం కాస్త ఎక్కువే ఉండటంతో, తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే కనెక్ట్ అయ్యేలా ఉంది. మలయాళంలో 200 కోట్లొస్తే, తెలుగులో వందకోట్లు ఈజీగా రావొచ్చనే అభిప్రాయముంది. ఫ్యామిలీ స్టార్ టాక్ వీక్ అవటంతో, టిల్లూ స్క్వేర్ దూకుడుకు అంతుండదు. సో ఇప్పుడు పోటీ అంటే మంజుమ్మల్ బోయ్స్‌కి టిల్లూ స్క్వేర్ మూవీ నుంచే అనుకోవాల్సిందే.