Tamannaah Bhatia: పెళ్లి బాట.. మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి ఎప్పుడంటే..?
తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగా వెల్లడించింది. తాజగా లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్దమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

Tamannaah Bhatia: ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి బాట పడుతున్నారు. ఇప్పటికే సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ మధ్యనే తాను ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్మెంట్ ఘనంగా చేసుకుంది. అలాగే వరుణ్ తేజ్ కూడా తాను ప్రేమించిన హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలోకి వచ్చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్‌గా తమన్నా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది. హ్యాపీడేస్ సినిమా వరకు పెద్దగా గుర్తింపు రాని.. ఈ భామకు ఆ తరువాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌పై పాక్ మాజీ ప్లేయర్ అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న ఇండియన్స్..
అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్.. హిందీ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడి జోరు కాస్త తగ్గింది. మరోవైపు తమన్నా.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో లవ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తమన్నా ఇటీవల బహిరంగంగా వెల్లడించింది. తాజగా లవ్ బర్డ్స్ తమన్నా-విజయ్ వర్మ పెళ్లికి సిద్దమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని మిల్కీ బ్యూటీ గతంలో ప్రకటించారు. అయితే, పేరెంట్స్ ఒత్తిడితో ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని, ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని సమాచారం.
తమన్నా-విజయ్.. ఇద్దరూ ఇప్పటికే చెట్టా, పట్టాలేసుకొని తిరుగుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. విజయ్ చేతిలో ప్రస్తుతం కొన్ని మూవీస్ ఉండడంతో వాటిని ఫినిష్ చేసి.. వచ్చే ఏడాదిలో వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.