Martin Luther King: మార్టిన్ లూథర్ కింగ్ ఎలా ఉంది..? మినీ రివ్యూ..!
సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్.. శుక్రవారం విడుదలైంది. ఊర్లో పేరులేని సంపూకి ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు రావటం, తన ఓటుతో సర్పంజ్ ఫేట్ తేలే ఛాన్స్ ఉండటం అన్న పాయింట్ బానే ఉంది. కొన్ని సీన్లు కితకితలు పెట్టిస్తాయి.
Martin Luther King: మార్టిన్ లూథర్ కింగ్ అంటేనే చరిత్రని తిరగరాసిన వ్యక్తి. అలాంటి పర్సన్ పేరుతో పొలిటికల్ సెటైర్ వేయాలనుకోవటం లేడీ డైరెక్టర్ పూజా సాహసమే. కాని ఈ సాహసం సాగతీత వ్యవహారంతో ఆడియన్స్ మీద రివేంజ్‌లా మారింది. సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్.. శుక్రవారం విడుదలైంది. ఊర్లో పేరులేని సంపూకి ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు రావటం, తన ఓటుతో సర్పంజ్ ఫేట్ తేలే ఛాన్స్ ఉండటం అన్న పాయింట్ బానే ఉంది. కొన్ని సీన్లు కితకితలు పెట్టిస్తాయి.
ఇంకొన్ని ఇరికించిన అతుకులు. మొత్తంగా తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయటంలో పూజా అండ్ కో పప్పులో కాలేశారనేమాటే వినిపిస్తోంది. అతి సీన్లు, కామెడీ కోసం కావాలని కోటి పెట్టి ఓటు కొనాలనుకునే ప్రయత్నాలు.. కంటెంట్ లేక తికమక పడే ఫిల్మ్ మేకర్స్ కష్టాలని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. నటన పరంగా సంపూర్ణేష్ కనులకు ఇంపుగానే కనిపించినా, పక్క పాత్రల కంపే కాస్త కష్టంగా మారిందనే కామెంట్స్ పెరిగాయి. ఈ సినిమా కథలో ఆడియన్స్ వ్యథని చూసి జాలిపడేలోపు, బాలీవుడ్ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం తేజస్ ఇంతకుమించే షాక్ ఇస్తోంది. అసలు బాలీవుడ్ రైటర్స్‌లో సరుకైపోయిందా, పెన్‌లో ఇంకైపోయిందా..? మెదడులో ఆలోచనా శక్తి తగ్గిందా అన్న అనుమానాలు వచ్చేలా ఉంది మూవీ తేజస్ కథ, అందులోని వ్యథ భయపెడుతున్నాయి. కంగనా ఏ మూడ్‌లో ఉండి తేజస్ సినిమా ఓకే చేసిందో అనిపిస్తుంది సినిమా చూస్తుంటే.
హాలీవుడ్ టాప్‌గన్ మూవీకి ఫీమేల్ వర్షన్ ప్లాన్ చేసి, దిక్కుమాలిన కథలో, హీరోయిజం పెంచటం కోసం కథని, డైరెక్షన్‌ని కూడా పక్కన పెట్టారంటే, నిజంగా సాహసమే. ఓ ఏజెంట్‌ని కాపాడేందుకు ఇండియన్ ఫైటర్ జెట్ పైలెట్ తేజస్ రంగంలోకి దిగుతుంది. ఎలా అంటే ఎవరి మాట వినదు.. ఎయిర్ ఫోర్స్‌లో తను లేడీ సీతయ్యలా ఎవరి మాట వినకుండా, ఎక్కడికి, ఎప్పుడు, ఎలా పోవాలన్నా, ఏదో ఆటోని తీసుకుని, బైకుని ఏసుకుని పక్క గల్లీకి పోయొచ్చినట్టుగా ఫైటర్ జెట్‌లో వెళ్లొస్తుంది. వార్ బ్యాక్ డ్రాప్‌కి వాడాల్సిన విమానాలని కార్టూన్ షోగా మార్చేశారు. నాసిరకం గ్రాఫిక్స్, కథ లేని కథనం, కథనం ఉందా అనేలా కథ, ఏముందో ఏం లేదో తేల్చుకోలేక, మతిస్థిమితం తప్పేలా ఆడియన్స్‌కి షాక్ ఇస్తోంది తేజస్. ఈ సినిమా గురించి చెప్పాలంటే, తేజల్ గిల్ అనే లేడీ ఫైలెట్ నడిపే జెట్ పేరు తేజస్.. తను ఎంచుకున్న మిషన్ తేజస్. దీన్ని బట్టి కథని ఎంత బాగా అల్లారో అర్ధం చేసుకోవచ్చు.