Ravi Teja : మాస్ విధ్వంసం.. లావాను కిందకు పిలవకు.. ఉనికి ఉండదు..!
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ.. వచ్చే సంక్రాంతికి ఈగల్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బరిలోకి దిగుతున్నాడు.

Mass Destruction.. Calling Lava Down.. No Existence..!
దసరా (Dussehra) బరిలో టైగర్ నాగేశ్వరరావుగా (Tiger Nageswara Rao) అలరించిన మాస్ మహా రాజా రవితేజ (Mass Maha Raja Ravi Teja).. 2024 సంక్రాంతికి ఈగల్ (Eagle) గా ఎటాక్ చేయనున్నాడు. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ.. వచ్చే సంక్రాంతికి ఈగల్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బరిలోకి దిగుతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
టీజర్ విషయానికి వస్తే.. పవర్ ఫుల్ డైలాగ్స్‌తో అదిరిపోయేలా కట్ చేశారు. కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఉనికి ఉండదు.. అనే డైలాగ్‌తో మొదలైన వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. రవితేజ క్యారెక్టర్ గురించి చెబుతూ.. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు.. అంటూ శ్రీనివాస్ అవసరాల ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయింది. అలాగే.. ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపం.. అంటూ నవదీప్ ఇచ్చిన ఎలివేషన్ కూడా హైప్ ఇచ్చింది.టీజర్ ఎండింగ్‌లో ఊరమాస్‌గా లుంగీలో కనిపించాడు మాస్ మహారాజా.
స్పై యాక్షన్ థ్రిల్లర్ (spy action thriller) గా ఈగల్ తెరక్కెక్కుతోంది. ధమాకాతో రవితేజకు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌తో క్యూరియాసిటీని పెంచేసిన మేకర్స్.. ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో షూరు చేశారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మొత్తంగా ఈగల్ టీజర్ చూస్తే.. రవితేజకు హిట్ గ్యారెంటీ అనేలా కనిపిస్తోంది. మరి ఈగల్ ఎలా ఉంటుందో చూడాలి.