కథ నిల్ స్క్రీన్ ప్లే ఫుల్, మాస్ ఎంటర్టైన్మెంట్, పుష్ప-2 Dial క్లియర్ రివ్యూ
ఇండియా వైడ్‌గా బన్నీ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన పుష్ప సినిమా ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. సో ఎలాంటి సోది లేకుండా ఈ సినిమా కథ విషయానికి వస్తే. పుష్పరాజ్ తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు.
ఇండియా వైడ్‌గా బన్నీ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన పుష్ప సినిమా ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. సో ఎలాంటి సోది లేకుండా ఈ సినిమా కథ విషయానికి వస్తే. పుష్పరాజ్ తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు. కట్ చేస్తే చిత్తూరు శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్‌తో అడ్డులేకుండా ఎదుగుతాడు. సిండికేట్ మొత్తం తన కంట్రోల్‌లోకి వస్తుంది. మరోవైపు పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ భన్వర్ సింగ్ షేకావత్ ప్లాన్ చేస్తున్నాడు. ఓ కూలీ వాడి వేషంలో అడవుల్లోకి వెళ్లి అందరినీ చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. తన అనుచరులను విడిపించడానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో పోలీసులందరినీ కొనేస్తాడు. పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ. దీంతో రెచ్చిపోయిన షేకావత్ ఒక సిండికేట్‌ని చంపేస్తాడు. అప్పుడు మిగిలిన సిండికేట్లు అంతా భయపడతారు. పుష్ప చేత సారీ చెప్పించాలని ఎంపీ సిద్దప్ప సమక్షంలో సిండికేట్ పార్టీ ఏర్పాటు చేయిస్తారు. అందులో పుష్ప బాగా తాగి వచ్చి షేకావత్‌కి సారీ చెబుతాడు. అయితే దాన్ని అవమానంగా భావించి మళ్లీ వెళ్లి షేకావత్ కారుని పచ్చడి చేస్తాడు స్విమ్మింగ్ పూల్‌లో మూత్రం పోసి అవమానిస్తాడు.
అప్పటికే ఇంటర్నేషనల్ స్మగ్లర్‌తో భారీ డీల్ కుదుర్చుకుంటాడు పుష్ప. రెండువేల టన్నులు ఎర్రచందనం అందించడం ఆ డీల్. భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. దానికోసమే పుష్ప ప్లాన్. దాన్ని అడ్డుకోవాలని షేకావత్ గట్టి ప్లాన్ చేస్తాడు. అయితే అంతకు ముందే సీఎంని కలవడానికి వెళ్లిన పుష్పకి అవమానం జరుగుతుంది. పుష్పతో సీఎం ఫోటో దిగేందుకు వెనకాడతాడు. స్మగ్లర్‌తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని వద్దు అంటాడు. అక్కడ పుష్ప ఈగో దెబ్బతింటుంది. దీంతో సీఎంనే మార్చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసమే భారీగా డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఈ డీల్ సెట్ చేస్తాడు. మరి షేకావత్‌ని దాటుకుని పుష్ప సరుకుని బార్డర్ దాటించాడా ? సీఎంని మార్చేశాడా ? ఈ క్రమంలో సెంట్రల్ మినిస్టర్, మైనింగ్ కింగ్ ప్రతాప్ రెడ్డితో గొడవేంటి ? తనని అవమానించిన సవతి అన్న ఫ్యామిలీ పుష్ప దగ్గరకు ఎందుకు వచ్చింది ? వారి కోసం పుష్ప ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ. పుష్ప 2 లో డైరెక్టర్ సుకుమార్ ఇష్టం వచ్చినట్టుగా సీన్లు పెట్టుకుని, పేర్చుకుంటూ పోయినట్టు ఉంటుంది. ఎమోషనల్ సన్నివేశాలు చాలా బలంగా ఉన్నా, ఆ ఫీల్ ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. ఫస్టాఫ్‌లో ఫస్ట్ ఫైట్ బాగుంది. అందులో బాస్ ఎవడ్రా మీ అందరికి నేనే బాస్ అని చెప్పే డైలాగ్ అదిరిపోయింది. పుష్పని పట్టుకునేందుకు షేకావత్ చేసే ప్రయత్నం మొదట్లోనే బాగుంది. ఆ తర్వాత ప్రతి సారి షేకావత్ విఫలమవుతుంటాడు. ఆయన ఎత్తులు వేస్తే.. పై ఎత్తులు వేసి పుష్ప సరుకుని పంపిస్తుంటాడు.
ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్ లు బాగున్నాయి. కొన్ని ఫన్నీగా ఉన్నాయి. మరికొన్ని మరీ నేల బారుగా ఉన్నాయి. సీఎం అవమానించాడని, సీఎంనే మార్చేయడం లాంటి సీన్లు సినిమాటిక్‌గానే ఉన్నాయి. న్యాచురల్ గా అనిపించలేదు. ఇలా కమర్షియల్ అంశాలను జోడించే క్రమంలో ఎలాంటి లాజిక్ లు పట్టించుకోలేదు. కానీ ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఒక్క హై ఇచ్చే సీన్ పెట్టి థియేటర్లలో ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించారు. దానికి తగ్గట్టుగానే పుష్ప రెచ్చిపోయిన తీరు బాగుంది. ఇంటర్వెల్ టైమ్‌లో వచ్చే సిండికేట్ పార్టీలో షేకావత్ కి వార్నింగ్, ఛాలెంజ్ విసరడం ఆశించిన స్థాయిలో పేలలేదు. ఉన్నంతలో ఓకే అనిపించింది. సెకండాఫ్‌లో జాతర ఎపిసోడ్ హైలైట్. ఇందులో అమ్మోరుగా వేషం వేసి పుష్ప చేసిన డాన్స్ నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంటుంది. రష్మిక పాత్ర సైతం రెచ్చిపోయిన తీరు బాగుంది. ఇక తన అన్న కూతురుని కిడ్నాప్ సందర్బంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్ విరోచితంగా ఉంది. పూనకాలు తెప్పించేలా ఉంది. ఎవ్వరికైనా ఆ సీన్లు చూస్తుంటే ఒళ్లుగగుర్పొడుపు రావడం పక్కా. ఆ రేంజ్‌లో దాన్ని డిజైన్ చేశారు. అంతకు ముందు వచ్చే సీన్లు నార్మల్‌గానే సాగుతాయి. సెకండాఫ్‌లో ఈ రెండు ఎపిసోడ్లు హైలైట్‌గా నిలుస్తాయి. ఇక క్లైమాక్స్ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్‌తో ముగించాడు. కథనంలో క్లారిటీ లేదు.
చాలా లాజిక్‌లు కూడా లేవు. కమర్షియల్ ఫ్రీడమ్ ఓవర్ అనిపించింది. అందుకే చాలా సీన్లు అసహజంగా అనిపిస్తాయి. కొన్ని సీన్లు ఇరికించినట్టుగానే ఉంటాయి. స్టోరీని బలంగా రాసుకుంటే బాగుండేది. విలన్ బలంగా లేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోతుంది. అది చప్పగా అనిపిస్తుంటుంది. అంతగా కిక్ ఇవ్వదు. సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సన్నివేశాలు పరిచయంకే పరిమితమయ్యాయి. డెప్త్ లేదు. మూడో పార్ట్ కి దాచి ఉంచారని అనిపిస్తుంది. డైలాగ్స్ లోనూ క్లారిటీ లేదు. చాలా డైలాగులు అర్థం కావడం లేదు. అది పెద్ద మైనస్. అయితే ఇప్పుడు మాస్, యాక్షన్ సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కోవాలోనే దీన్ని డిజైన్ చేశారు. ఫ్యాన్స్ కి నచ్చే ఎలివేషన్స్, ఎలిమెంట్లకి ప్రయారిటీ ఇచ్చారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. థియేటర్లలో బన్నీ ఫ్యాన్స్ కి, మాస్ ఆడియెన్స్ కి మాత్రం పూనకాలు పక్కా. పుష్పకు ఇగో సానా ఎక్కువ. ఎర్రచందనం సిండికేట్‌లో పని చేసే ఒక కూలీ డబ్బు సంపాదించాలనే కసితో కోట్ల రూపాయిలు సంపాదించడాన్ని అక్కడ సిండికేట్ లో అంతకు ముందే పాతుకుపోయిన విలన్లను లేపేసి.. ఉన్నవాళ్ళ అందరిని డామినేట్ చేసి ఎలా రైజ్ అయ్యాడనేది పుష్ప పార్ట్ 1 అయితే.. అలా రైజ్ అయిన పుష్ప పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు ? అసలు పుష్పకు ఎదురైన సంఘటనలు ఏంటి ? సినిమాలో పుష్ప తల కొరివి పెట్టింది ఎవరికి ? ఉంచుకున్న ఆమెకు పుట్టిన పుష్పకు ఇంటి పేరు వస్తుందా లేదా ?
అసలు హీరోయిన్ కు సినిమాలో పెళ్ళాం మాట వింటే ఎలా ఉంటుంది అనే డైలాగ్ ఎందుకు వచ్చింది ? పుష్పను శ్రీవల్లి కోరిన కోరిక ఏంటి ? అనేవి ఆసక్తి కలిగించే సన్నివేశాలు. మాస్, కమర్షియల్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లు గట్టిగా దట్టించి వండిన వంటకం పుష్ప 2: ది రూల్. ఈ సినిమాలో పుష్ప గాడి శివతాండవాన్ని ఎవడూ ఆపలేరనిపిస్తుంది. అల్లు అర్జున్ అలియాస్ పుష్ప నటన, జాతర సీన్, సుకుమార్ దర్శకత్వ ప్రతిభ , పీలింగ్స్ సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ లు సినిమాకు బాగా ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. అయితే.. ఫస్ట్ హాఫ్ సాగదీత, హీరోయిన్ రష్మిక నటన, శ్రీలీలా స్పెషల్ సాంగ్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్. పుష్ప 2 లో జాతర సీన్… ఆ సీన్ చూడటానికి ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్లకు రావడం ఖాయం…. ఆ సీన్ కు ఒక్క అభిమానులకే కాదు.. సినిమా చూసే ప్రతిఒక్కరికీ పూనకాలు రావడం గ్యారెంటీగా చెప్పొచ్చు. నటన విషయానికి వస్తే అల్లు అర్జున్ పుష్ప’గా నటవిశ్వరూపం చూపించేశాడు. నటించమంటే జీవించేశాడు. అసలు ‘గంగోత్రి’ లో నటించింది ఇతనేనా? అనిపించక మానదు. పుష్ప పాత్రకు ఒక్క అల్లు అర్జున్ తప్ప మరే హీరో న్యాయం చెయ్యలేరు. ఇక జాతర సీన్స్ లో అయితే పుష్ప రాజ్ నటించిన తీరు యాంటీ ఫ్యాన్స్ కు సైతం పూనకాలు తెప్పిస్తుంది. మరోసారి పుష్పరాజ్‌గా దుమ్ములేపాడు.
మొదటి భాగం మించి రెచ్చిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడని చెప్పొచ్చు. ఇక జాతర ఎపిసోడ్‌లో అమ్మోరు గెటప్‌లో బన్నీని చూస్తే పూనకాలే. యాక్షన్స్ లోనూ అదరగొట్టాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. డాన్సులతో ట్రీట్ ఇచ్చాడు. శ్రీవల్లిగా రష్మిక మందన్నా ఎవరేజ్. రష్మిక నటనకు ఓ రేంజ్ లో వావ్ అనలేం కానీ శ్రీవల్లి పాత్రకు న్యాయం చేసింది. పాటల్లో బన్నీ, రష్మిక లు బాగా చేశారు. కనువిందు కలిగించారు. . శ్రీలీలా స్పెషల్ సాంగ్ కంటే కూడా ఈమె చేసిన ఫీలింగ్స్ సాంగ్ కే ఎక్కువ మార్కులు వేయొచ్చు. ఫహద్ ఫాజిల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అనసూయ రోల్ ఏం లేదు.. ఏదో ఉందంటే ఉంది అంతే.. ఒక రోల్ ఇవ్వాలి కాబట్టి సుకుమార్ ఇచ్చాడు. ఇక పీలింగ్ పాటలో కూడా శ్రీలీలతో రెచ్చిపోయి చేశాడు బన్నీ. షేకావత్‌గా ఫాహద్ ఫాజిల్ సైతం రచ్చ చేశాడు. నెగటివ్ షేడ్ ఉన్న రోల్‌లో ఆయన పిచ్చెక్కించాడు.
అయితే ఆయన పాత్రని డల్‌గా చూపించడం మైనస్. జగపతిబాబు సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రెడ్డి పాత్రలో ఉన్నంత సేపు హై ఇచ్చాడు. ఆయన కూడా చిత్తూరు యాసలో కొత్త గెటప్‌లో రెచ్చిపోయాడు. రావు రమేష్‌కి మరో బలమైన పాత్ర పడింది. కేశవ పాత్రలో జగదీష్ మరోసారి మెప్పించారు. టెక్నీకల్ గా చూస్తే… క్లోజప్‌లు, లాంగ్ షాట్ లు బాగున్నాయి. విజువల్స్ ట్రీట్ అనేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన అన్ని పాటలు ఉర్రూతలూగించేలా ఉన్నాయి. పాటలకంటే సౌండింగ్, హీరోహీరోయిన్లు డాన్సులు స్పెషల్ ఎట్రాక్షన్. మొత్తం మీద 3 పాటలే బాగున్నాయి. ఫైట్ సీన్లకి బీజీఎం మోతమోగించారు. రొటీన్ కి భిన్నంగానే ఉంది. థమన్, దేవిశ్రీ ప్రసాద్, సామ్ సీఎస్ బీజీఎంతో అదరగొట్టారు. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే! సినిమాకి అదే పెద్ద బలం. దర్శకుడు సుకుమార్ సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు. పుష్ప రాజ్ పాత్రని మెయిన్‌గా తీసుకుని కథని నడిపించాడు. డైలాగ్‌లు పవర్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. మొత్తం మీద మాస్‌కి, ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు సుకుమార్. పుష్ప 2 కంటే పుష్ప 1 బాగుంది అనే ఫీల్ తో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.