Guntur Karam Item Song  : మహేష్ కోసం మాస్ మసాలా సాంగ్ 

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్‌ గా శ్రీలీల నటిస్తుండా, రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 23, 2023 | 06:02 PMLast Updated on: Dec 23, 2023 | 6:02 PM

Mass Masala Song For Mahesh

 

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్‌ గా శ్రీలీల నటిస్తుండా, రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక గుంటూరు కారం సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ ఉంటుందని మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సిన పూజా హెగ్డే ఛాన్స్ మిస్ చేసుకున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఛాన్స్ మిస్ చేసుకున్న పూజా హెగ్డే కి ఐటం సాంగ్ ని చేసే ఛాన్స్ ఇస్తారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే, గుంటూరు కారం లో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయడం లేదని.. ఆ పాటలో ఖిలాడి బ్యూటీ డింపుల్‌ హయతి కనిపించబోతుందని యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది.

ఐటం సాంగ్స్ కి డింపుల్‌ పెట్టింది పేరు అన్నట్లుగా ఈ మధ్య కాలంలో మారింది. అందుకే త్రివిక్రమ్‌ ఆమెను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. థమన్‌ స్వరపర్చిన మాస్ ఐటం సాంగ్‌ లో మహేష్ బాబు మరియు డింపుల్‌ హయతి స్టెప్పులేయనుంది. సంక్రాంతికి రాబోతున్న అన్ని సినిమాల్లోకి గుంటూరు కారం సినిమాకు ఎక్కువ హైప్‌ క్రియేట్‌ అయ్యింది. అందుకే ఏ విషయంలో కూడా ఛాన్స్ తీసుకోకుండా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాల ఫలితాలు నిరాశ పరిచిన నేపథ్యంలో, గుంటూరు కారంతో ఘాటైన సూపర్ హిట్ ను సంక్రాంతికి తీసుకురానున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.