Yash New Movie : మాస్టర్ ఈజ్ బ్యాక్.. నిద్ర లేచిన యాష్
ఎట్టకేలకు నెక్ట్ష్ మూవీని యష్ రివీల్ చేస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించిన యష్ ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తన 19వ సినిమా డిటేల్స్‌ను ప్రకటిస్తాడు.

Yash is finally revealing the next movie
ఎట్టకేలకు నెక్ట్ష్ మూవీని యష్ రివీల్ చేస్తున్నాడు. అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించిన యష్ ఈనెల 8న ఉదయం 9 గంటల 55 నిమిషాలకు తన 19వ సినిమా డిటేల్స్‌ను ప్రకటిస్తాడు. ఈ సంద్భంగా పోస్టర్ రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. కేజీఎఫ్ 2 వచ్చి 20 నెలలు దాటింది. 2024 ఏప్రిల్ 14 నాటికి రెండేళ్లవుతుంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో తీసిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. హీరోయిన్ నిధి శెట్టి ‘తెలుసు కదా’ లో సిద్దు జొన్నలగడ్డతో జత కడుతోంది.
ఇంతవరకు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా గ్యాప్‌లో పడిపోయిన యష్ నెక్ట్స్‌మూవీ గురించి ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేస్తూ.. 8న చెబుతానన్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన హీరోలు బిజీ అయిపోతారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ చేతిలో రెండు సినిమాలున్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ అయితే నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు. మరి యష్ మూవీ ఏమిటంటే? 20 నెలలుగా ఆన్సర్ దొరకని ప్రశ్నకు 8న సమాధానం రానుంది. కేజీఎఫ్2 తర్వాత యష్ నటించనున్న సినిమాలపై చాలా రూమర్స్ వస్తున్నాయి. నార్తన్.. శంకర్.. పూరీ వంటి దర్శకుల పేర్లు వినిపించినా.. ఇవన్నీ గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ యష్ ను డైరెక్ట్ చేస్తోందన్న న్యూస్ ఆమధ్య బైటకొచ్చినా.. తవరకు ఎనౌన్స్ చేయలేదు. మరి యశ్ ఏ డైరెక్టర్‌తో వర్క్ చేస్తాడో చూడాలి మరి.