రివ్యూ : మ‌త్తు వద‌ల‌రా 2 మత్తెక్కించిందిగా

మత్తు వదలరా లాంటి మంచి సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 వస్తుందన్న వార్తలతో అందరూ చూపు ఈ సినిమాపై పడింది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్... ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్‌ ఏర్పడడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 13, 2024 | 02:48 PMLast Updated on: Sep 13, 2024 | 2:48 PM

Mathu Vadalara 2 Review

ప‌రిచ‌యం :
మత్తు వదలరా లాంటి మంచి సినిమాకు సీక్వెల్ గా మత్తు వదలరా 2 వస్తుందన్న వార్తలతో అందరూ చూపు ఈ సినిమాపై పడింది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్… ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్‌ ఏర్పడడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సీక్వెల్‌పై ఉన్న అంచనాలు అందుకుందా.. మత్తు వదలరా స్థాయిలో మంచి వినోదం దట్టించిందా ? సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.

క‌థ :
బాబు మోహన్ ( శ్రీ సింహ ) – ఏసుదాసు ( సత్య ) లకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు వస్తాయి.. సారి ఉద్యోగాలు వచ్చాయి.. అనడం కంటే తెచ్చుకున్నారు అని చెప్పాలి. కిడ్నాప్ కేసులు పరిష్కరించడం వీళ్ల‌ స్పెషాలిటీ.. చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి వర్కౌట్ చేస్తూ ఉంటారు. రెస్యూ ఆప‌రేష‌న్ల‌కు ఎగ్‌స్ట్రా డబ్బులు కోసం తస్కరణ విద్య ప్రదర్శిస్తూ ఉంటారు. కిడ్నాపర్లకు ఇచ్చే డబ్బుల్లో కొంత మొత్తాన్ని లేపేయటం మొదలుపెడతారు. అయితే ఎవరికి ఈ విషయం తెలియకుండా బయటపడకుండా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఓసారి రియా అనే అమ్మాయి కిడ్నాప్ కేసు దర్యాప్తు చేస్తుంటే ఊహించని విధంగా వీళ్ల కారులోనే ఆ అమ్మాయి శవం దొరుకుతుంది.. దీంతో వీళ్ళిద్దరూ ఇరుకులో పడిపోతారు. అక్కడ నుంచి ఆ ఇద్దరిపై ఆకాష్ ( అజయ్ ) – మైకేల్ ( సునీల్ ) లాంటి ఆఫీసర్లు అనుమానపడటం మొదలుపెడతారు. వీళ్ళపై నిఘా పెట్టి ఉంచుతారు.. అసలు రియా ఎవరు ? ఆమె మరణానికి కారణం ఏమిటి ? ప్రియ మర్డర్ కేస్ కు సినీ హీరోయిన్ యువ ( వెన్నెల కిషోర్ ) కు ఉన్న లింక్ ఏంటి ? రియా హత్య వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి ? ఈ కేసును బాబు ( యేసు ) ఎలా పరిష్కరించారు ఈ కేసులో నిధి ( ఫ‌రియా అబ్దుల్లా ) ఏం చేసింది ? ఇలాంటి విషయాలు తెలియాలంటే మత్తు వదలరా 2 సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ :
సాధారణంగా సీక్వెల్‌ సినిమాలు అది హిట్ కామెడీ కు సీక్వెల్ అంటే చాలా కష్టం అని చెప్పాలి. అయితే దర్శకుడు ఈ సినిమాను చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని ఓ కొత్త లైన్ తీసుకొని ముందుకు వెళ్లాడు. అయితే ఫస్టాఫ్‌ లో కామెడీ ఉన్నా ట్విస్టులు లేవు.. కానీ కథలోకి స్పీడ్ గా వెళ్లి వరుసగా సీన్లు నడిపిస్తూ దూసుకుపోతూ ఉంటాడు. సత్య – శ్రీ సింహ స్పెషల్ ఏజెన్సీ ఆఫీసర్లుగా చేసే పనులు నవ్విస్తాయి. కొత్తగా ను ఉంటాయి. ఇలాంటి కామెడీ సీన్లు హాలీవుడ్ సినిమాలలో మాత్రమే మనం చూస్తూ ఉంటాము. వాటిని ప్రేర‌ణ‌గా తీసుకుని ఈ సినిమాలో పెట్టారా అన్న సందేహము కలుగుతుంది. సినిమా అంతా స‌త్య కామెడీ టైమింగ్ బేస్ చేసుకుని ప్ర‌ధానంగా నడిపించాడు.. సత్య బాడీ లాంగ్వేజ్ తో సీన్లో దమ్ము లేని చోట్ల కూడా కామెడీ పండింది.. ఫస్ట్ అఫ్ అదిరిపోయింది… అయితే ఫస్టాప్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో గ్రిప్ కాస్త తగినట్టు అనిపిస్తుంది.

సెకండ్ హాఫ్ జస్ట్ ఒకే అన్నట్టుగా నడిచిపోయింది. సినిమాలో ఎక్కువ భాగం వన్ లైనర్ల‌తో పాటు ఆర్గానిక్ గా అప్పటికప్పుడు పుట్టినట్టు ఉండే ఫ‌న్‌తో చాలా వరకు నవ్వించే సీన్లతో దర్శకుడు ప్రజెంట్ చేశాడు. ఇది తెర‌మీద బాగా వర్క‌వుట్ అయింది.. కథగా చెప్పుకోవడానికి ఏమి లేని ఈ సినిమాలో కథనమే ప్రధానం అని చెప్పాలి.. ఇంటర్వెల్ వరకు జరిగిందంతా చక్కగా ఎంజాయ్ చేస్తాం.. కావలసినంత కామెడీ ఉంటుంది.. ఇంటర్వెల్‌ తర్వాత కామెడీ డోస్ తగ్గి.. కథలోకి వెళ్ళటం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ పై దృష్టి పెట్టడంతో స్లో అయింది.. ఏదేమైనా కథలో ఇంకొంచెం స్ట్రాంగ్ పాయింట్ ఉంటే సినిమా మరింత అదిరిపోయేది. ఫ‌రియా అబ్దుల్లా తన లుక్స్ కానీ గ్లామర్ షో తో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది.

మొదటి భాగం మంచి హిట్ అవ్వడానికి కామెడీ సహా థ్రిల్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా కుదరడం.. ఈసారి కామెడీ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయినా థ్రిల్ ఎలిమెంట్స్ ఇంకొంచెం ఎగ్జైట్ చేసే విధంగా ఉంటే బాగుండేది. అలాగే మెగాస్టార్ చిరంజీవిని అనుసరిస్తూ సత్య చేసిన డ్యాన్సులు బాగున్నాయి. టెక్నికల్ గా చూస్తే ఈ సినిమా సాంకేతికంగా చాలా బాగుంది.. స్క్రిప్ట్ లో ఫ‌న్‌కు అవకాశం ఇచ్చినట్టుగా క్రైమ్ ఎలిమెంట్‌కు అవకాశం ఇవ్వలేదు… బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు.. ఫ‌న్‌కు తగినట్టుగా ఉంది. కాలభైరవ‌ సినిమాకు పెద్ద ఎసెట్ అని చెప్పాలి. సురేష్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది… మంచి విజువల్స్ ఇచ్చాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త స్లో అయినట్టు ఉంది.. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.