స్పిరిట్ కోసం మే అంకితం… 1 నుంచి 31 వరకు దబిడి దిబిడే…
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ మేలో సెట్స్ పైకెళుతోంది. కాకపోతే కేవలం సినిమాను మొదలు పెట్టి, అసలు షూటింగ్ ని జులై ఎండ్ నుంచి మొదలు పెడతారని ప్రచారం జరిగింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి ప్లాన్ చేసిన స్పిరిట్ మూవీ మేలో సెట్స్ పైకెళుతోంది. కాకపోతే కేవలం సినిమాను మొదలు పెట్టి, అసలు షూటింగ్ ని జులై ఎండ్ నుంచి మొదలు పెడతారని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు ఇందుకు పూర్తి భిన్నంగా షూటింగ్ షెడ్యూల్ నేప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఏకంగా మే 1 నుంచి 31 వరకు సింగిల్ డే బ్రేక్ లేకుండా 31 రోజుల షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అంత అర్జెంట్ గా ఎందుకు తను మనసు మార్చుకున్నాడో మాత్రం తేలట్లేదు. ఫౌజీ షూటింగ్ పూర్తైతే కాని, ప్రభాస్ మరో లుక్ లో కి మారే ఛాన్స్ ఉండదు.. కానీ ఈలోపే స్పిరిట్ షూటింగ్ మొదలు పెడితే, ఫౌజీ లుక్ తప్ప కొత్త లుక్ లో కిక్ ఇచ్చే అవకాశమే లేదు. మరి ప్రభాస్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తున్నాడు..? సందీప్ రెడ్డి వంగ ఒకవేళ రెబల్ స్టార్ లుక్ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా? ఇంకేమైనా ఆల్టర్ నేటివ్ ఐడియా వచ్చిందా? టేకేలుక్
రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి కమిటైన మూవీ స్పిరిట్. ఇందులో హీరోయిన్ గా రష్మిక నుంచి కొరియన్ లేడీ వరకు చాలా మంది పేర్లు వినిపించాయి. విలన్ గా కొరియన్ నటుడు డాన్ లీ పేరు కూడా వినిపించింది. ఆల్రెడీ కథ సిద్దమైంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ముగిశాయి. ఓరకంగా ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్ మోస్ట్ పూర్తయ్యాయి.ఇక సినిమా ప్రొడక్షన్ షురూ చేయటమే మిగిలిఉంది. కాని ఫౌజీ మూవీ ప్రజెంట్ షెడ్యూలే పూర్తి కాలేదు. ఇంకా 90శాతం షూటింగ్ పూర్తవ్వాలంటే మరో ఐదు నెల్ల టైం పడుతుంది. కాని మే 1 నుంచి 31 వరకు స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ ని చాలా లెంథీగా ప్లాన్ చేశాడు సందిప్ రెడ్డి వంగ. రెబల్ స్టార్ కూడా బల్క్ గా డేట్లిచ్చాడు.
ఇక్కడే ఎవరికీ అర్ధం కాని విషయం ఏంటంటే, మొన్నటికి మొన్న ఫౌజీ సెట్లో అనుపమ్ ఖేర్ తో ప్రభాస్ దిగిన ఫోటో బయటికొచ్చింది. అందులో బొద్దుగా ఉన్న ప్రభాస్ కి అసలు ఫౌజీ గా కనిపించే లుక్కేలేదన్నారు.సైనికుడి లుక్ లేకున్నా ఫ్లాష్ బ్యాక్ సీన్లు తీస్తున్నారు కాబట్టే, ఇలా ఆ లుక్ తోనే కంటిన్యూ చేస్తున్నారని ప్రచారం జరిగింది.మరి మే 1 నుంచి 31 మధ్యలో స్పిరిట్ తీయాలనుకుంటే, కేవలం 2 నెలల్లో ప్రభాస్ లుక్ మారుతుంది. ఈ రెండునెలల్లో ది రాజా సాబ్ షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడు..? ఫౌజీ మేజర్ షూటింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాడు. వీటన్నీంటి మీద క్లారిటీ వచ్చింది కాబట్టే ప్రభాస్ పూర్తి స్థాయిలో స్పిరిట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగ కూడా మరీ ఏళ్ల కేళ్లు వేయిట్ చేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకంటే, రణ్ బీర్ కపూర్ అక్కడ రామాయణం మొదటి పార్ట్ పూర్తి చేసేపనిలో ఉన్నాడు. అదయ్యేలోగా ప్రభాస్ స్పిరిట్ ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేయాలి. ఆతర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ పనులు మొదలు పెట్టాలి. ప్రభాస్ కంటే రణ్ బీర్ కపూర్ సినిమా ఎక్కువేం కాకపోవచ్చు..కాని సందీప్ రెడ్డి అక్కడ ముందే కమిటైనప్పుడు, మాట మీద నిలబడాల్సి వస్తుంది. అందుకే మే నెలంతా స్పిరిట్ తాలూకు బేసిక్ టాకీ పార్ట్ ని తీసి, జులైలో యాక్షన్ పార్ట్ ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి వంగ…సో ఫస్ట్ టైం ప్రభాస్ ని పోలీస్ పాత్రలో చూపించబోతున్న సందీప్, ఈ సినిమాని కేవలం నాలుగున్నర నుంచి 5నెలల్లోనే పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.