టాలీవుడ్‌లో మొదలైన మీ టూ రచ్చ… సమంత డిమాండ్‌తో ప్రకంపనలు..

కేరళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ప్రకంపనలు రేపుతోంది. 290 పేజీలతో రిపోర్టు రెడీ చేసిన జస్టిస్ హేమ కమిటీ.. మాలీవుడ్ చీకటి బాగోతాలను బయటపెట్టింది. ఇండస్ట్రీ అంతా 15మంది చేతుల్లోనే ఉందని.. అవకాశాలు రావాలన్నా.. వచ్చిన అవకాశాలు నిలబడాలన్న..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 1, 2024 | 11:43 AMLast Updated on: Sep 01, 2024 | 11:43 AM

Me Too Racha Started In Tollywood Vibrations With Samanthas Demand

కేరళ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ప్రకంపనలు రేపుతోంది. 290 పేజీలతో రిపోర్టు రెడీ చేసిన జస్టిస్ హేమ కమిటీ.. మాలీవుడ్ చీకటి బాగోతాలను బయటపెట్టింది. ఇండస్ట్రీ అంతా 15మంది చేతుల్లోనే ఉందని.. అవకాశాలు రావాలన్నా.. వచ్చిన అవకాశాలు నిలబడాలన్న.. అర్పించుకోవాల్సిన పరిస్థితులు నటీమణులకు ఎదురవుతుందని షాకింగ్ రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదిక తర్వాత.. వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మాలీవుడ్‌ మాయలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు.. ప్రతీ ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోంది. చాలామంది హేమ కమిటీపై మాట్లాడుతున్నారు. నటి షకీలా, హీరో విశాల్ కూడా దీనికి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా.. హేమ కమీషన్ రిపోర్ట్‌పై స్పందించింది. కేరళ ఇండస్ట్రీలో హేమకమిటీ ప్రయత్నంపై అభినందనలు గుప్పించింది. ఐతే అక్కడితో ఆగకుండా.. టాలీవుడ్‌ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేసింది.

దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్లీ మీ టూ చర్చ మొదలైంది. గతంలో టాలీవుడ్‌లో మీ టూ ఆరోపణలు వచ్చినప్పుడు.. ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక దోపిడీపై… అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం హైలెవల్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ నివేదిక బయటపెట్టాలన్నదే ఇప్పుడు సమంత డిమాండ్‌. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహిళలపై దారుణమైన వేధింపులు జరుగుతున్నాయని.. సివిల్ సొసైటీ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించింది.

ఐతే దీనిపై ఘాటుగా రియాక్ట్ అయిన న్యాయస్థానం.. ఇలాంటి వేధింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అప్పటి కేసీఆర్ సర్కార్.. ఓ కమిటీ నియమించింది. FDC ఛైర్మన్‌తో పాటు.. సినిమాటోగ్రఫీ మంత్రి, పోలీసు డిపార్ట్‌మెంట్‌, విమెన్ అండ్‌ చైల్డ్ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, ఇండస్ట్రీ నుంచి దిల్‌ రాజు, స్వప్న దత్‌, జయసుధ, తమ్మారెడ్డి, సుప్రియతో పాటు పలువురు ఉన్నారు. ఐతే పనిభారం కారణంగా.. ఈ హైలెవల్ కమిటీ.. ప్రీతి నిగమ్‌, ఝాన్సీతో పాటు మరికొందరితో సబ్ కమిటీ నియమించింది. హీరోయిన్లు, జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, డ్యాన్సర్లతో ఈ సబ్ కమిటీ భేటీ అయింది.

2022 జన్‌లో హైలెవల్‌ కమిటీకి నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఆ నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. ఐతే ఆ రిపోర్టులో ఏముందో.. ఎవరు ఏం చెప్పారో.. ఎవరి బాగోతం ఏంటో.. ఇప్పటికీ బయటకు రాలేదు. ఆ నివేదికను బయటపెట్టాలనే సమంత డిమాండ్ చేస్తోంది. మరి సమంత డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందా.. బయటపెడుతుందా అనే చర్చ జరుగుతోంది. బయటపెడితే మాత్రం.. మాలీవుడ్‌లో ఇక్కడ మరో రచ్చ జరగడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. టాలీవుడ్‌కు చెందిన కొందరు హీరోయిన్లు.. తాము ఎదుర్కొన్న వేధింపులపై బయటకు చెప్పారు. మరి ఆ రిపోర్టులో అలాంటి బాధితులు ఇంకెంతమంది ఉన్నారో !