Meenakshi Chaudhary: వరుస ఆఫర్స్ పట్టేస్తున్న మీనాక్షి చౌదరి..
గుంటూరు కారం, ప్రభాస్ స్పిరిట్, పవర్ స్టార్‌తో సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే సినిమా.. ఇలా అనేక సినిమాల్లో మీనాక్షి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరి సడన్‌గా మీనాక్షి చౌదరికే ఎందుకు ఆఫర్ల వరద పెరిగిందంటే.. సైమా సెలబ్రేషన్స్ సందడిలో ఈ లేడీ అందాలు ఆరబోయటమే కారణం అంటున్నారు.

Meenakshi Chaudhary: యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కెరీర్‌లో హిట్-ద సెకండ్ కేస్ అనే ఒక్క హిట్ మూవీ తప్ప మరో బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ లేదు. ఇచ్చట వాహనాలు నిలుపరాదు నుంచి రవితేజ మూవీ ఖిలాడీ వరకు అన్నీ ఫ్లాపులే. అయినా కాని.. గుంటూరు కారం, ప్రభాస్ స్పిరిట్, పవర్ స్టార్‌తో సురేందర్ రెడ్డి తెరకెక్కించబోయే సినిమా.. ఇలా అనేక సినిమాల్లో మీనాక్షి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరి సడన్‌గా మీనాక్షి చౌదరికే ఎందుకు ఆఫర్ల వరద పెరిగిందంటే.. సైమా సెలబ్రేషన్స్ సందడిలో ఈ లేడీ అందాలు ఆరబోయటమే కారణం అంటున్నారు.
ఖిలాడీలో కూడా గ్లామరస్‌గా కనిపించిన మీనాక్షి ఏ మూవీ చేసినా తన లుక్స్ బానే ఉన్నాయి. కాని అందాల ఆరబోతలో మాత్రం మోతమోగలేదు. అదే ఖిలాడీలో డింపుల్ హయతి అవసరానికి మించి స్కిన్ షో చేసి ఇక మిగిలిందేం లేదనేంత రోత పుట్టించిందనే కామెంట్లు వచ్చాయి. అందుకే తనకి ఆఫర్లు మిస్ అయ్యాయా లేదంటే, మరొక కారణమా పక్కన పెడితే, మీనాక్షి చౌదరికి ఛాన్స్‌లు రావటానికి తను పెంచిన గ్లామర్ డోసే కారణం. ఎంత పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉన్నా, ఈ మాజీ మిస్ ఇండియాకి ఆఫర్లు మిస్ అవటానికి రీజన్, అందాల ఆరబోతలో వెనకబడటమే.
సో డాన్స్‌తోపాటు అదృష్టంతో శ్రీలీల మహేశ్, పవన్ అండ్ కో సరసన మెరుస్తోంది. మీనాక్షీ చౌదరి మాత్రం ఈమధ్య ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇంటర్వూల వరకు, సైమా అవార్డ్స్ సెలబ్రేషన్స్ నుంచి యాడ్స్ వరకు అందాల ఆరబోతలో బాలీవుడ్ రేంజ్‌లోదూసుకెళుతోంది. మొత్తానికి పవన్, ప్రభాస్ ప్యూచర్ ప్రాజెక్టుల్లో ఆఫర్స్ పట్టేసింది.