Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి దండయాత్రలు ఊహాతీతమేనా?
గ్లామర్, పెర్ఫామెన్స్ ఇలా అన్నీ ఉన్నా హీరోకి ఆమ్లెట్లు, సోడాలిచ్చే పాత్ర చేసిందేంటా అన్నారు. ఆ కష్టం ఊరికే పోలేదు. ప్రభాస్ మూవీలో ఆఫర్ పట్టుకునేలా చేసింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రెబల్ స్టార్ చేయబోయే మూవీలో మీనాక్షి కన్ఫామ్ అయ్యిందట.

Meenakshi Chaudhary: గుంటూరు కారంలో మహేశ్ ఎనర్జీ ఫ్యాన్స్‌కి మతిపోగొట్టింది. ఎటొచ్చి త్రివిక్రమ్ పెన్ను సరిగా రాయలేదు కాని, సూపర్ స్టార్ కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్పామెన్స్ ఇందులో కనిపించింది. అయితే, ఈ మూవీలో అయ్యో పాపం అనేలా ఫోకస్ అయ్యింది మాత్రం మీనాక్షి చౌదరి. గ్లామర్, పెర్ఫామెన్స్ ఇలా అన్నీ ఉన్నా హీరోకి ఆమ్లెట్లు, సోడాలిచ్చే పాత్ర చేసిందేంటా అన్నారు.
CHIRANJEEVI-PAWAN KALYAN: మెగా విరాళం.. జనసేనకు మెగాస్టార్ రూ.5 కోట్లు విరాళం
ఆ కష్టం ఊరికే పోలేదు. ప్రభాస్ మూవీలో ఆఫర్ పట్టుకునేలా చేసింది. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రెబల్ స్టార్ చేయబోయే మూవీలో మీనాక్షి కన్ఫామ్ అయ్యిందట. సీతారామం ఫేం మృణాల్ కూడా ఇందులో నటిస్తోంది కాని, మేయిన్ లీడ్ మాత్రం మీనాక్షి చౌదరి అని తెలుస్తోంది. అంతేకాదు.. తమిల్ స్టార్ దళపతి విజయ్ చేస్తున్న గోట్.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీలో కూడా మేయిన్ లీడ్ మీనాక్షి చౌదరినే. ఇక విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా మీనాక్షికే ఆఫర్ అందినట్టు తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్‌లో తనే హీరోయిన్ గా నటిస్తోంది. మట్కాలో కూడా మీనాక్షి ఆఫర్ పట్టేసింది. ఇలా పెద్ద హీరోలనుంచి మీడియం రేంజ్ స్టార్స్ వరకు అందరికీ తనే బెస్ట్ ఆప్షన్‌గా మారింది. శ్రీలీల ఆఫర్లకు, రష్మిక, పూజా హెగ్డే అవకాశాలకు నెమ్మదిగా గండి కొట్టేస్తోంది. ఇలాగే ఆఫర్లు పట్టేస్తే.. త్వరలోనే టాప్ లీగ్‌లోకి దూసుకెళ్లడం ఖాయం.