Meenakshi Chaudhary: గుంటూరు కారంలో ఆమ్లెట్ వేస్తే.. అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్..?
ఈ సినిమాలో ఆమ్లెట్లు, సోడాలు ఇచ్చే పాత్ర వేయటానికి కారణం బన్నీ సినిమానే. గుంటూరు కారంలో మహేశ్ మరదలిగా కనిపించినా, తనకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ ఇచ్చారు. అయినా తను ఒప్పుకోవటానికి ఒకటి మహేశ్ సరసన మెరిసే అవకాశమే.

Meenakshi Chaudhary: గుంటూరు కారంలో ఆటలో అరటిపండైంది మీనాక్షి చౌదరి. ఈ హీరోయిన్ అసలు అందులో ఎందుకు నటించిందిరా బాబు అంటూ చాలా మంది జాలి పడ్డారు. శ్రీలీల కంటే ఈ హీరోయినే మహేశ్‌కి బాగా సూటైందని, అయితే, తనకి ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర ఇచ్చారని అంతా జాలి చూపించారు. అయితే మీనాక్షి అంత తింగరి హీరోయినేం కాదు. ఈ సినిమాలో ఆమ్లెట్లు, సోడాలు ఇచ్చే పాత్ర వేయటానికి కారణం బన్నీ సినిమానే.
TRISHA: చిరంజీవి తర్వాత వెంకీ, నాగ్, బాలయ్యతో జోడీ కన్ఫామ్
గుంటూరు కారంలో మహేశ్ మరదలిగా కనిపించినా, తనకి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేని రోల్ ఇచ్చారు. అయినా తను ఒప్పుకోవటానికి ఒకటి మహేశ్ సరసన మెరిసే అవకాశమే. అయితే తనకి కూడా మరీ, ఇంత చిన్న రోల్ ఇస్తారని తెలియదని, ఫైనల్‌గా మూవీ రిలీజ్ టైంలో టోటల్ మూవీ చూసి తను కూడా డిసప్పాయింట్ అయ్యిందని ఆమధ్య వార్తలొచ్చాయి. ఏదేమైనా సినిమా సోసోగా ఆడటం వల్ల ఈ అంశం అటకెక్కింది. కాని మీనాక్షి కష్టం వృథా పోలేదు. తనకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో జోడీకట్టే ఛాన్స్ చిక్కింది. అది కూడా మెయిన్ హీరోయిన్‌గా. అసలే పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు బన్నీ. అలాంటి తనతో, అది కూడా తన మెయిన్ హీరోయిన్‌గా మారటం మీనాక్షి చౌదరి అదృష్టమే. ఇదంతా గుంటూరు కారంలో ఆమ్లెట్ వేసే పాత్రకే పరిమితమైన మీనాక్షి కోసం త్రివిక్రమ్ చేసిన న్యాయం అంటున్నారు.
ఆల్రెడీ అరవ స్టార్ విజయ్ దళపతి మూవీ గోట్‌లో హీరోయిన్‌గా మెరుస్తున్న మీనాక్షి, తర్వాత రౌడీ స్టార్ విజయ్‌తో గౌతమ్ తిన్ననూరి తీసే సినిమాలో కూడా హీరోయిన్‌గా కనిపించబోతోంది. ఇలా సెకండ్ హీరోయిన్ నుంచి మెయిన్ హీరోయిన్ వైపు తనకి ప్రమోషన్ వస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్లు చేసే సినిమాలో అవటం చూస్తుంటే, తన తలరాత మారే టైం వచ్చినట్టే ఉంది.