Meenakshi Chaudhary: గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి మీద భారీగా ట్రోలింగ్..
హీరోయిన్ మీనాక్షి చౌదరి మీద మీమ్స్, ట్రోలింగ్ మొదలై గుంటూరు కారం మూవీ యూనిట్‌కు అదో తలనొప్పైంది. గుంటూరు కారం మూవీలో ముందు పూజా హెగ్డేని హీరోయిన్ అనుకున్నారు. తర్వాత తన స్థానంలోనే మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.

Meenakshi Chaudhary: గుంటూరు కారం ఈవెంట్ వాయిదా పడిందని ఒక వైపు ఫ్యాన్స్ కంగారు పడుతుంటే.. మరో వైపు ఇందులో హీరోయిన్ మీద మీమ్స్, ట్రోలింగ్ మొదలై అదో తలనొప్పైంది. గుంటూరు కారం మూవీలో ముందు పూజా హెగ్డేని హీరోయిన్ అనుకున్నారు. తర్వాత తన స్థానంలోనే మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. కానీ, ఇంతవరకు తన తాలూకు సందడి గ్లింప్స్‌లో కాని, విడుదలైన పాటల్లో కాని కనిపించలేదు.
GUNTUR KAARAM: ప్రి రిలీజ్ ఈవెంట్ల తలరాత మార్చేసిన పవన్ కళ్యాణ్
కుర్చీ మడతెట్టి పాట సందడి చూస్తుంటే.. ఇందులో అసలు హీరోయిన్ శ్రీలీలేనేమో అనుకునే పరిస్థితి వచ్చింది. ఏదో మీనాక్షి చౌదరి లుక్ ఒకటి వదిలారు కాని.. అసలు ఇందులో మీనాక్షి ఉందా.. లేదా.. లేకపోతే.. ఎక్కడైనా మసాజులు చేస్తోందా..? సినిమాలో హీరోకి, మిగతా వాళ్ల భుజాలు మర్దనా చేయడానికే తన పాత్ర సరిపోయిందా..? అంటూ మీమ్స్ భారీగా పెరిగాయి. ఖిలాడీ మూవీలో కూడా మీనాక్షి చౌదరినే లీడింగ్ లేడీ. కానీ, డింపుల్ హయాతే హీరోయిన్ అన్నంతగా తనకే పేరు, అటెన్షన్ దక్కాయి. ఇప్పుడు గుంటూరు కారంలో కూడా మీనాక్షికి ఏమాత్రం అటెన్షన్ దక్కకుండా క్రెడిటంతా శ్రీలీలకే వెళ్లిపోతోంది. సందడంతా తనదే అయ్యింది. అందుకే సినిమాలో మీనాక్షి ఎక్కడంటూ ట్రోలింగ్స్, మీమ్స్ పెరిగాయి.