Mega Akash: ఆ రాజకీయ నేత కుమారుడితో మేఘా ఆకాశ్ పెళ్లి..?
సినీ స్టార్స్ పొలిటీషియన్స్‌ని.. పొలిటీషియన్స్ సినీ స్టార్స్‌ని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అప్పట్లో జెనీలియా, నవనీత్ కౌర్ రీసెంట్‌గా పరిణితీ చోప్రా రాజకీయ నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులను పెళ్లాడారు.

Mega Akash Marriage With Politician
ఇప్పుడు మరో బ్యూటీ మేఘా ఆకాశ్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. లై సినిమాతో సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతోందట. ఓ బడా రాజకీయ నేత కొడుకుతో మేఘా పెళ్లి జరగబోతోందని టాక్. అయితే ఆ రాజకీయ నేత ఎవరు అన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ విషయంలో మేఘా నుంచి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ వస్తుంది అంటున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు తీసిన మేఘా 20కి పైగా సినిమాలు చేసింది.
ఎన్ని సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. రీసెంట్‌గా వచ్చిన రావణాసుర సినిమా కూడా యావరేజ్‌గా నిలిచింది. అయితే మేఘా పెళ్లి వార్తలపై ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చ జరుగుతోంది. ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోయే ఆ అదృష్టవంతుడు ఎవరా అని మేఘా ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. అయితే ఈ హీరోయిన్‌ను మనసు దోచేసిన ఆ పొలిటీషియన్ ఎవరో వేచి చూడాలి.