మెగా కాంపౌండ్..? నందమూరి కాంపౌండ్…? అల్లు కాంపౌండ్..?
కాంట్రవర్సీకి సింగిల్ కామెంట్ చాలు.. కాని అదే వివాదం మెల్లిగా తూఫాన్ గా మారాలంటే, ఆలోచనల్లో పడేసే స్టేట్ మెంట్ కావాలి. అలాంటి స్టేట్ మెంటే వస్తే, దాని ఇంపాక్ట్ చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది.

కాంట్రవర్సీకి సింగిల్ కామెంట్ చాలు.. కాని అదే వివాదం మెల్లిగా తూఫాన్ గా మారాలంటే, ఆలోచనల్లో పడేసే స్టేట్ మెంట్ కావాలి. అలాంటి స్టేట్ మెంటే వస్తే, దాని ఇంపాక్ట్ చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాట, మొన్న తూటాలా దూసుకెళితే, ఇప్పుడు మెల్లిగా తుఫాన్ క్రియేట్ చేస్తోంది. ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కాని, హీరోలకి, లేదంటే ఇండస్ట్రీలో ఎలాంటి కాంపౌండ్ ఉండదన్నాడు చిరు. అయితే ఇప్పుడు ఆ మాటలో నిజమెంత అన్న డిస్కర్షన్ మొదలైంది. మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్, అల్లు కాంపౌండ్, ఇలా చాలా కాంపౌండ్స్ ఉన్నాయనేది భ్రమా? నిజమా? చిరు లాంటి స్టారే అవన్ని బ్రమలని తేల్చాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా అది నిజమవ్వాలి… కాని కోరికకు, నిజానికి మధ్య ఉన్న తేడాని ఎవరూ చెరిపేయలేరు.. అంతా బాగుండాలని కోరుకోవచ్చు.. కాని అంతా బాగుందా అన్నదే ఇక్కడ సమస్య… టాలీవుడ్ లో కాంపౌండ్స్ లేని వాతావరణం నిజంగా సాధ్యమా అన్న ప్రశ్నకి… ఆన్సర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ రూపంలో దొరుకుతోంది. ఓరకంగా ఒక మంచి మాట, సడన్ గా తేనె తుట్టెనే కదిపేసినట్టుంది.. అదెంటో చూసేయండి.
మెగాస్టార్ చిరంజీవి అన్న ఒక్క మాట ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తుందో లేదో కాని, సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఆల్రెడీ తన మాటలు ట్రోలింగ్ కి గురయ్యాయి. సరే ఒకరోజు, రెండు రోజుల తర్వాత సీన్ మారుతుందంటే రోజు రోజుకి, సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం ట్రోలింగ్స్ రూపంలో పెరిగింది. ఇంటికి కాంపౌండ్ ఉంది కాని, ఇండస్ట్రీలో రకరకాల కాంపౌండ్ లేవని మనసు విప్పి చెప్పాడు చిరు.
కాని నిజంగా అలాంటి కాంపౌండ్ లేని ఇండస్ట్రీనే తెలుగు ఇండస్ట్రీనా అంటే, ఎవరికీ నమ్మకం కలగట్లేదు. కౌంటర్లు ఆగట్లేదు. ఆల్రెడీ జనాల్లో మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్ ఉందనే అభిప్రాయముంది. హీరోలంతా ఒకటే… ఎవరూ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు, తిట్టుకున్నట్టు తిట్టుకోరు. కాని స్టార్స్ మధ్య అసూయ, రాగద్వేశాలు లేవని, ఈగో క్లాషెస్ కి ఛాన్స్ లేదని చెప్పలేని పరిస్థితి..
ప్రొఫేషనల్ రైవలరి ఉండటం మంచితే, కాని మ్యాటర్ అక్కడి వరకే పరిమితం కాదు. అంతకు మించి నువ్వు వేరు, నేను వేరు.. మీటం వేరు మా టీం వేరని ఎప్పుటినుంచో గ్రూప్స్ , కాంపౌండ్స్ ఉన్నాయనే అభిప్రాయం రియాలిటీకి దగ్గరగా ఉంది. అది ఉండకూడదని కోరుకోవటం తప్పుకాదు… చిరు మాట్లాడింది కూడా తప్పుకాదు. కాని కాంపౌండ్స్ లేవనటమే రియాలిటీకి దూరంగా ఉందంటున్నారు.
అంతెంటుకు మెగా కాంపౌండ్ నుంచే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెపరేట్ అయ్యి, అల్లు ఆర్మీ అంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ మెంబరే అయినా ఎన్టీఆర్ కి, బాలయ్య కాంపౌండ్ కి దూరం ఎక్కవనే అభిప్రాయం ఉంది. బాబాయ్ అబ్బాయ్ కలిసే ఛాన్స్ ఉన్నా, ఇద్దరి మధ్య అబిమానం ఉన్నా, పొలిటికల్ రీజన్స్ లేదంటే మరే ఇతర కారణలతో గ్యాప్ అయితే ఉందనే మాట కొంతవరకు నిజమే…
కాని బాబాయ్ తో అబ్బాయ్ కలవబోతున్నారంటూ, అన్ స్టాపబుల్ ఎపిసోడ్ నుంచి ప్రచారం మొదలైంది.. ఇక అక్కినేని ఫ్యామిలీకి, నటసింహానికి ఉన్న గ్యాప్ గురించి కూడా ఇండస్ట్రీలో అంతా ఓపెన్ గానే మాట్లాడుతారు.. పార్టికో ఛానెల్ ఉన్నట్టే, స్టార్ హీరో కో గ్యాంగ్ ఉండటం టాలీవుడ్ లో కామన్ అయ్యింది. అలా ఉండకూడదనే చిరు చెప్పాడు… కాని ఇప్పుడా టాపిక్ గెలకటం వల్ల, తేనె తుట్టెనే కదిపినట్టైంది. కాంపౌండ్స్ లేకపోతే, ఇదేంటి, అదేంటి అని, చిరు, బాలయ్య, నాగ్, బన్నీ, అండ్ కో కాంపౌండ్స్ మీద ఎవరికి తోచింది వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక హీరో గ్రూప్ మరో హీరో గ్రూప్ మీద ముందుగా సాఫ్ట్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేసి, చిలికి చిలికి తుఫాన్ గా మారినట్టు, ఆట్రోలింగ్ సోషల్ మీడియాలో యుద్దానికే తెరతీస్తోంది.