Mega Daughter: ఇన్‌స్టాలో నిహారిక పోస్ట్.. విడాకుల గురించి ఏం చెప్పిందంటే
మెగా డాటర్ కొణిదెల నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకోబోతోందంటూ కొన్ని రోజుల నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చైతన్య, నిహారిక ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో ఈ గాసిప్స్ మొదలయ్యాయి. అన్‌ఫాలో చేయడమే కాకుండా తన ప్రొఫైల్‌లో ఉన్న నిహారిక ఫొటోలన్నీ డెలీట్ చేశారు చైతన్య. ఓన్లీ తన కుక్కతో నిహారిక ఉన్న ఫొటో మాత్రమే ఉంచుకున్నాడు.
ఇటు నిహారిక కూడా చాలా వారాల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేదు. బయట కూడా పెద్దగా కనిపించడంలేదు. కేవలం ప్రమోషనల్ వీడియోలు తప్ప పర్సనల్ పోస్ట్ ఒక్కడి కూడా పెట్టడంలేదు. దీంతో ఆమె డిప్రెషన్‌లో ఉందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో అప్‌లోడ్ చేసింది నిహారిక. తాను నార్మల్‌గానే ఉన్నానంటూ చెప్పకనే చెప్పింది. కానీ బయట వస్తున్న గాసిప్స్, రూమర్స్ గురించి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. నిహారిక హస్బెండ్ చైతన్య కూడా ఈ విషయంలో ఇప్పటి వరకూ రియాక్ట్ అవ్వలేదు.
గతంలో కూడా వీళ్లు విడిపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ వాటన్నికీ అప్పుడు చైతన్య చెక్ పెట్టాడు. భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. కానీ ఇప్పుడు స్వయంగా ఆయనే ఫొటోస్ అన్నీ డిలీట్ చేశాడు చైతన్య. దీంతో ఖచ్చితంగా వాళ్ల మధ్య గ్యాప్ వచ్చిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని రోజుల తరువాత ఇన్‌స్టా పోస్ట్ చేసిన నిహారిక కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో గాసిప్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు రియాక్ట్ అయితే తప్ప ఈ గాసిప్స్ ఆగేలా కనిపించడంలేదు.