Emotional Post : ఫస్ట్ పోస్ట్‌తో ‘ఫిదా’ చేసిన మెగా కోడలు.. వరుణ్ రియాక్షన్ ఏంటంటే..
మెగా ప్రిన్స్‌ను ఫిదా చేసి.. మెగా కోడలైన లావణ్య త్రిపాఠి.. తమ డ్రీమ్ మ్యారేజ్‌పై ఫస్ట్ టైమ్ స్పందించింది.. వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త వరుణ్ తేజ్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది..

Mega daughter-in-law who did 'Fidaa' with the first post.. Varun's reaction is..
మెగా ప్రిన్స్‌ను ఫిదా చేసి.. మెగా కోడలైన లావణ్య త్రిపాఠి.. తమ డ్రీమ్ మ్యారేజ్‌పై ఫస్ట్ టైమ్ స్పందించింది.. వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త వరుణ్ తేజ్ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.. తాము కలలు కన్న విధంగానే తమ పెళ్లి జరిగిందని.. వరుణ్ మంచి మనసున్న వ్యక్తి అంటూ భర్తపై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది..
Salaar: సలార్ కష్టాలు.. ఒక్కోసారి క్రేజ్ కూడా శాపమే..
అద్భుతమైన ప్రేమ, దయ గల వ్యక్తి ఇప్పుడు నా భర్త అయ్యారు.. తన గురించి చెప్పడానికి నా దగ్గర ఎంతో ఉంది.. కానీ.. ఆ విషయాలన్నింటినీ మా మధ్యే దాచుకుంటాం అంటూ ఫ్యాన్స్‌ని ఊరించింది.. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో మా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నామో అదే విధంగా మూడు రోజుల పాటు వివాహం జరిగింది. మీ ఆశీస్సులతో ఈ వేడుకలను మాకెంతో ప్రత్యేకంగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది..
ఈ పోస్ట్‌లో లావణ్య తన పెళ్లి చీర, మెహందీని చూపించారు. మేలి ముసుగుపై ‘వరుణ్ లవ్’ అని ఆమె ప్రత్యేకంగా రాయించుకున్నారు. పుట్టిల్లు, అత్తింటివారితో దిగిన ఫొటోలను పంచుకున్నారు.. లావణ్య పెట్టిన పోస్ట్‌కు వరుణ్ మరోసారి ఫిదా అయిపోయారు.. తన శ్రీమతికి ముద్దు ఎమోజీతో కామెంట్ పెట్టారు.. అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కూడా మెగా కోడలి ట్వీట్‌కి ఫిదా అయిపోతున్నారు.. కానీ..లావ్.. తమ ప్రేమ కబుర్లు తమిద్దరి మధ్య మాత్రమే దాచుకుంటాం అనడంతో కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.. అమ్మ లవ్… నీలో ఇంత చిలిపితనం ఉందా..? ఆ చిలిపితనంతోనే మా వాడిని కొంగున ముడి పెట్టేసుకున్నావా అంటూ మురిసిపోతున్నారు..