Niharika: మెగా డాటర్ మళ్లీ పెళ్లి.. ఇబ్బంది పెట్టే ప్రశ్న కాదు..?
మెగా డాటర్ నిహారికా కొంతకాలంగా భర్తకి దూరంగా ఉందన్నారు. డివోర్స్ అప్లై చేసిందేమో అనేశారు. ఐతే ఇప్పుడదే నిజమైంది. తను అఫీషియల్ గా తేల్చింది. ఐతే మళ్లీ పెళ్లి మీద చర్చ పెరిగింది. కారణం ఏంటి ? జస్ట్ వాచ్ ఇట్

Mega daughter Nagababu's daughter Niharika married an industrialist named Chaitanya two years ago and recently got divorced
మెగాడాటర్ నిహారికా అంటేనే హైపర్ యాక్టివ్. అలాంటి తన లైఫ్ లో పెళ్లి ఓ స్పీడ్ బ్రేకర్ లా మారిందంటారు. మూడేళ్ల క్రితమే చైతన్యతో ఏడడుగులు నడిచిన నిహారికా లైఫ్ లో డివోర్స్ ఓ పేయిన్ గా మారింది. మొన్నటి వరకు భర్తతో దూరంగా ఉందన్నారు. డివోర్స్ తీసుకునేంతగా ఇద్దరి మధ్య దూరం పెరిగలేదన్నారు.
కట్ చేస్తే చైతన్యతో తను విడిపోతున్నట్టు సింగిల్ పోస్ట్ తో తేల్చేసింది నిహారికా. ఇక తనని సపోర్ట్ చేసిన బంధుమిత్రులకు థ్యాంక్స్ చెబుతూనే, తన ప్రైవసీని గౌరవించమంది. ఇంతలో తన పెళ్లి మీద చర్చ షురూ. తన అన్న వరున్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఏడడుగులు నడిచాక, నిహారికా తన కొత్త జీవితం తాలూకు పెద్ద నిర్ణయం తీసుకోబోతోందట.
నిహారికా ప్రస్థుతానికి తన మ్యారేజ్ లైఫ్ లో ఎదురైన ఇబ్బందులనుంచి బయట పడి, తనని తాను సినిమాలు, వెబ్ సీరీస్ లతో బిజీ చేసుకుంటోంది. సో ఇప్పట్లో తను మళ్లీ పెళ్లి గురించి ఆలోచించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఐతే అన్న పెళ్లి తర్వాత కనీసం ఏడాది గ్యాప్ ఇచ్చి తను కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటోందనే గుసగుసలు పెరగటంతో, కొత్త లైఫ్ అంటే ఇక మళ్లీ పెళ్లే అంటున్నారు. ఏదేమైనా తను పెళ్లి తాలూకు మానసిక గాయాలనుంచి కోలుకుని, కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు తక్కువ టైమే తీసుకుంటుందనే అంచనాలున్నాయి.