మేనల్లుడి ముఖం చూడటం ఇష్టం లేదా…? బర్త్ డే పార్టీలో బిజీగా మెగా హీరో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే సినిమా పరిశ్రమ మొత్తం తమ పనులు మానుకుంది. మెగాస్టార్ నుంచి చిన్న చిన్న స్టార్ల వరకు అందరూ తమ పనులు మానుకుని అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. మరి మెగాస్టార్ ఫ్యామిలీ ఎక్కడ...?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుకే సినిమా పరిశ్రమ మొత్తం తమ పనులు మానుకుంది. మెగాస్టార్ నుంచి చిన్న చిన్న స్టార్ల వరకు అందరూ తమ పనులు మానుకుని అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. మరి మెగాస్టార్ ఫ్యామిలీ ఎక్కడ…? చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, వరుణ్ తేజ్ ఎక్కడ ఉన్నారు…? వీళ్ళు ఎవరూ ఎందుకు అల్లు అర్జున్ ఇంటికి రాలేదు…? నిన్న అరెస్ట్ తర్వాత చిరంజీవి, నాగబాబు వెళ్లి కాసేపు అక్కడ ఉంది వచ్చారు అంతే.
కాని అల్లు అర్జున్ ను అసలు కలవలేదు. విడుదలై వచ్చిన తర్వాత కూడా కలవలేదు. నిన్న అల్లు అర్జున్ అరెస్టు అయ్యి చిక్కడపల్లి పోలీసుల అదుపులో ఉన్న దగ్గరి నుంచి అందరూ బయటికి ఎలా తేవాలా అని నిమగ్నమై ఉన్న సమయంలో… చిరంజీవి… అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఆయనతో పాటే నాగ బాబు వచ్చారు. తమకు ఉన్న పరిచయాలను ఎక్కడా వాడే ప్రయత్నం చేయలేదు. నాని సహా చాలా మంది హీరోలు, హీరోయిన్లు అర్జున్ కి మద్దతుగా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. రానా లాంటి చాల మంది హీరోలు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు.
కానీ ఒక్క మెగా, యువ హీరోల స్పందన కరువైంది. కనీసం వచ్చి అల్లు అర్జున్ ను శనివారం కలిసే ప్రయత్నం చేయలేదు. అరెస్టు కి ఒక్క రోజు ముందు అంటే గురువారం సాయంత్రం జరిగిన సంబరాల ఏటిగట్టు ఈవెంట్ లో నవ్వుతూ కనిపించాడు రాం చరణ్. కానీ, సాయి దుర్గా తేజ్ కానీ, వైష్ణవ్ తేజ్ కానీ అసలు బన్నీ ఇంటికి రాలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా లేదు. వరుణ్ తేజ్ అయితే దాదాపు నెలన్నర తర్వాత వరుణ్ తేజ్ శనివారం ఒక ట్వీట్ చేసాడు. రెండ్రోజుల క్రితమ్ రిలీజైన సాయిధరమ్ తేజ్ సినిమా టీజర్ గురించి ట్వీట్ చేసాడు.
చరణ్ కూడా రాణా పుట్టిన రోజు కోసం ట్వీట్ చేసాడు. సాయిధరమ్ కూడా వీళ్లకి రిప్లై ట్వీట్స్ వేశాడు. కాని అల్లు అర్జున్ గురించి ఒక్క పోస్ట్ కూడా వేయలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి భార్య సురేఖ మాత్రమే వచ్చారు. మేనత్త కాబట్టి రాక తప్పలేదు. ఇది చూసిన జనాలు… వీళ్ళ అందరికీ అల్లు అర్జున్ మీద కోపం కంటే ద్వేషం ఉండి ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. తమ సపోర్ట్ లేకుండా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అనే కోపం అయి ఉండవచ్చు అనేది కొందరి మాట. తన తండ్రిని అవమానించినందుకు మెగా నీడ నుంచి బయటకి వచ్చి తనకంటూ సొంతగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవటం కూడా వారికి నచ్చలేదనే టాక్ కూడా ఉంది. కానీ పైన చెప్పిన హీరోల్లో ఒక హీరో రాత్రి ఒక బర్త్ డే పార్టీకి కూడా వెళ్లి వచ్చాడు. మరి బన్నీ ఇంటికి రావడానికి అంత అసూయ ఏంటో అర్ధం కాలేదు అంటున్నారు జనాలు.