Mega Family: వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఫిక్స్.. కన్ఫాం చేసిన మెగా ఫ్యామిలీ..
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి కొన్ని రోజులగా వస్తున్న గాసిప్స్ నిజమయ్యాయి. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. రేపు వరుణ్ ఇంట్లో వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు గ్రీటింగ్ కార్డ్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు.
టూ హార్ట్స్, వన్ లవ్ అంటూ ఓ కార్డ్ డిజైన్ చేసి వరుణ్, లావణ్యకు కాంగ్రాట్స్ చెప్తున్నారు. దీంతో వీళ్లిద్దరి పెళ్లి గురించి వచ్చిన గాసిప్స్ అన్నీ నిజమేనని కన్ఫాం అయ్యింది. చాలా దగ్గరి సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా వరుణ్, లావణ్య పెళ్లి గురించి ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే సినీ స్టార్స్ జీవితాల్లో ఇలాంటి గాసిప్స్ కామన్. కానీ వరుణ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ అనుకున్నదే నిజం అయ్యింది. చాలా రోజుల నుంచి వరుణ్ లావణ్య లవ్‌లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.
రీసెంట్‌గా అయితే ఏకంగా పెళ్లి చేసేసుకున్నారు అని గాసిప్స్ వచ్చాయి. కానీ మెగా ఫ్యాన్స్ ఈ గాసిప్స్‌ను కొట్టిపారేశారు. మెగా కుటుంబానికి చెందిన హీరో సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకుంటాడంటూ వాదించారు. అయితే రీసెంట్‌గా జూన్ 9న వీళ్ల ఎంగేజ్‌మెంట్ జరగబోతోందని వార్తలు వచ్చాయి. మెగా కుటుంబానికి చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రావడంతో.. వరుణ్ లావణ్య పెళ్లి చేసుకోబోతున్నారని అంతా ఫిక్స్ అయ్యారు. అఫిషియల్‌గా ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా అని ఎదురుచూశారు. వాళ్ల వెయిటింగ్‌కు ఎండ్‌కార్డ్ వేస్తు ఇవాళ ఏకంగ్రా గ్రీటింగ్ కార్డ్ రిలీజైంది. దీంతో మెగా ఫ్యాన్స్ వరుణ్, లావణ్యకు కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్లు పెడుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.