1200 కోట్లు… 670 కోట్లు… 1000 కోట్లు… భయపెట్టే మెగా టార్గెట్స్

పాన్ ఇండియా హీరో అంటే పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ మెట్టెక్కితే సరిపోదు. వెయ్యికోట్ల వరద తేవాలి.. కనీసం నార్త్ ఇండియాలో 350 కోట్ల పైనే వసూళ్లతో పాటు మాస్ పూనకాలు తెప్పించాలి... అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. బాహుబలి తర్వాత, సాహో నార్త్ ని షేక్ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2024 | 05:46 PMLast Updated on: Dec 14, 2024 | 5:46 PM

Mega Family Has Big Target For Game Changer

పాన్ ఇండియా హీరో అంటే పాన్ ఇండియా మార్కెట్ లో హిట్ మెట్టెక్కితే సరిపోదు. వెయ్యికోట్ల వరద తేవాలి.. కనీసం నార్త్ ఇండియాలో 350 కోట్ల పైనే వసూళ్లతో పాటు మాస్ పూనకాలు తెప్పించాలి… అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ అయ్యాడు. బాహుబలి తర్వాత, సాహో నార్త్ ని షేక్ చేసింది. తర్వాత సలార్ దుమ్ముదులిపింది. కల్కీ 1200 కోట్లు రాబట్టింది. కట్ చేస్తే దేవర 510 నుంచి 670 కోట్ల వరకు రాబడితే అందులో 350 నుంచి 400 కోట్లు నార్త్ నుంచే వచ్చాయి. ఇప్పుడు పుష్ప2 వెయ్యికోట్ల వసూల్ల లో 70శాతం వసూళ్లు నార్త్ నుంచే వచ్చాయి. దీనికి తోడు ఒకే ఏడాది మూడు పాన్ ఇండియా హిట్లు తెలుగులోనే వెలిగాయి. కాబట్టి మరో తెలుగు హీరో మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మీదే కొండంత ప్రెజర్ పెరిగింది. కల్కీ, దేవర, పుష్ప2 హిట్లతో ఇక గేమ్ ఛేంజర్ వంతొచ్చిందన్న మాటే ఫిల్మ్ టీం ని కంగారు పెట్టిస్తోంది… మరి ఈ కంగారు.. కలెక్షన్స్ గా మారి తుఫాన్ క్రియేట్ చేస్తుందా?

2024 నిజంగా బాలీవుడ్ నే కాదు, కోలీవుడ్, తోపాటు శాండిల్ వుడ్ ని కూడా భయపెట్టింది. కారనం వరుసగా మూడు పాన్ఇండియా హిట్లు తెలుగు నుంచే రావటం. ఈ ఏడాది కల్కీతో ప్రభాస్ 1200 కోట్ల వసూళ్లు రాబడితే, దేవరతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 510 నుంచి 670 కోట్లు రాబట్టాడు.

రీసెంట్ గా 1000 కోట్ల క్లబ్ లో పుష్ప2 చేరింది. ఇది కాకుండా హనుమాన్ మూవీ 350 నుంచి 450 కోట్ల వరకు రాట్టింది. సరే హనుమాన్ సంగతి వేరు… కల్కీ, దేవర, పుష్ప2 మూడు కూడా పాన్ ఇండియా హీరోల సినిమాలు కాబట్టి, వాటి వసూళ్లే హాట్ టాపిక్ అయ్యాయి.

పాన్ ఇండియా లెవల్లో తన క్రేజ్ ఇంకా పెరిగిందని సలార్, కల్కీతో ఈ ఏడాది ప్రభాస్ ప్రూవ్ చేస్తే, దేవర తో పాన్ ఇండియా పరీక్స రాసి డిస్టింక్షన్ లో పాసయ్యాడు. పుష్ప2 తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా లెవల్లో ప్రూవ్ చేసుకున్నాడు

ఇక మిగిలింది మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టారే… శంకర్ డైరెక్షన్ లో తను చేసిన గేమ్ ఛేంజర్
సంక్రాంతికి రాబోతోంది. ఒకవైపు పండగ, మరోవైపు కొత్త ఏడాది, ఇంకో వైపు తన తోటి పాన్ ఇండియా హీరోలంతా పాన్ ఇండియా పరిక్షలో పాసవ్వటం కాదు, డిస్టింక్షన్ లోదుమ్ముదులిపారు. కాబట్టి అందరి కన్ను గ్లోబల్ స్టార్ మీదే ఉంటుంది.

దీనికి తోడు కల్కీ 1200 కోట్లు రాబడితే, దేవర 510 నుంచి 670 కోట్లు, పుష్ప 1000 కోట్లతో పెద్ద పెద్ద టార్గెట్లే సెట్ చేశాయి. కాబట్టి గేమ్ ఛేంజర్ హిట్ అవటం కాదు ఈ మూడు నెంబర్స్ లో ఏదో ఒక రేంజ్ ని టచ్ చేయటమో, బ్రేక్ చేయటమో చేయకపోతే గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా రేసులో వెనకబడినట్టే అనంటున్నారు. ఇదే తనకి అసలైన ఛాలెంజ్.