Mega Family: ఆడియన్స్‌ ముందుకు మామ అల్లుళ్లు.. వినోదయా సితం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న వినోదయా సితం రీమెక్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 28న విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్‌ అనౌన్స్‌ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2023 | 03:30 PMLast Updated on: Mar 25, 2023 | 3:30 PM

Mega Family Pawan Kalyan Sai Dharm Tej Film

సముద్రఖని డైరెక్షన్‌లో తమిళ్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. దీంతో తెలుగులో కూడా సముద్రఖని డైరెక్షన్‌ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్‌ కంప్లీట్‌ అయిపోయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా స్టార్ట్‌ అయ్యాయి. మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ దేవుడిగా కనిపించనున్నాడు. సాయిధమ్‌ తేజ్‌ పవన్‌ కల్యాణ్‌ భక్తుడి రోల్‌ చేస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సినిమా అనౌన్స్‌మెంట్‌ నుంచి ఇప్పటి వరకూ అన్నీ చకచకా జరిగిపోయాయి. తమిళంలో ఆల్రెడీ షూట్‌ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉండటంతో ఇప్పుడు చాలా ఫాస్ట్‌టా షూటింగ్‌ కంప్లీట్‌ చేశాడు సముద్రఖని. అటు త్రివిక్రమ్‌ కూడా స్క్రిప్ట్‌ విషయంలో సముద్రఖనికి చాలా సపోర్ట్‌ అందించాడు. దీంతో ఒకేసారి నాలుగైదు సెట్లు వేసి.. జెట్‌ స్పీడ్‌తో షూటింగ్‌ కానిచ్చేశారు. అంతే స్పీడ్‌తో రిలీజ్ డేట్‌ కూడా ఎనౌన్స్‌ చేశారు. ముందు నుంచి పవన్‌ కళ్యాణ్‌కు, సాయి ధరమ్‌తేజ్‌కు మంచి రిలేషన్‌షిప్‌ ఉంటుంది. ఈ మామఅల్లుళ్ల కాంబోకు ఆఫ్‌స్క్రీన్‌లో కూడా చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే బొమ్మ దద్దరిల్లిపోతుందంటున్నారు మెగా ఫ్యాన్స్‌.