మళ్ళీ అల్లుకున్న మెగా ఫ్యామిలీ రిలేషన్.. సెట్ అయిపోయిందా…?

మెగా ఫ్యామిలీలో కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారా? ఆ కుటుంబంలో పెద్దలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ దీనికి బీజాలు వేస్తున్నారా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 12:00 PMLast Updated on: Feb 12, 2025 | 12:00 PM

Mega Family Relation Intertwined Again Is It Set

మెగా ఫ్యామిలీలో కాంట్రవర్సీలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయ్యారా? ఆ కుటుంబంలో పెద్దలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ దీనికి బీజాలు వేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. కొన్ని రోజుల నుంచి మెగా వర్సెస్ అల్లు అనే టాపిక్ సినీ అభిమానులను బాగా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా మెగా అభిమానులు ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు. దశాబ్దాల పాటు కలిసి సినిమాలు చేసిన మెగా ఫ్యామిలీ.. ఇప్పుడు ఒకరి సినిమాపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూసి మెగా అభిమానుల్లో భయం కనబడింది.

టాలీవుడ్ లో తిరుగులేని డామినేషన్ కంటిన్యూ చేసిన మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఇలా… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఏంటి అని ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో ఫైర్ అయిపోయారు. ఇక ఇరు కుటుంబాల మధ్య దూరం బాగా పెరగటం… పుష్ప సినిమా మరింత పెద్దది చేయడం జరిగింది. ఇక తాజా పరిస్థితిని చూస్తుంటే మరోసారి మెగా ఫ్యామిలీలో విభేదాలు దాదాపుగా తొలగిపోయినట్లు కనపడుతున్నాయి. దీనికి అల్లు అరవింద్ ముందు అడుగు వేసినట్లుగా సమాచారం. ఆదివారం విశ్వక్సేన్ హీరోగా నటించిన లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చారు.

ఆయన ఈ వేడుకలో మాట్లాడుతూ తెలుగు సినిమా హీరోలు ఒకరికొకరు సహకరించుకోవాలని.. మా ఫ్యామిలీలోనూ చాలామంది హీరోలు ఉన్నారని.. ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఇక పుష్ప సీక్వెల్ సాధించిన సక్సెస్ తో తాను ఎంతో గర్వపడుతున్న అన్నారు చిరంజీవి. చాన్నాళ్ల తర్వాత ఒక మెగా హీరో పుష్ప 2 ప్రస్తావన తీసుకురావడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా నిర్వహించిన తండేల్ పైరసీ ప్రెస్మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈమధ్య ఓ ఈవెంట్లో తాను రామ్ చరణ్ స్థాయిని తగ్గించి మాట్లాడినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారని, ఈ విషయంలో నన్ను బాగానే ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవానికి తాను దిల్ రాజు గారి పరిస్థితి చెప్పే క్రమంలో.. ఎలాంటి దురుద్దేశం లేకుండా మాట్లాడానని.. దీనికి కొందరు మెగా అభిమానులు ఫీలయ్యారని కామెంట్ చేశారు. చరణ్ తనకు కొడుకు లాంటివాడని.. నా ఏకైక మేనల్లుడు అంటూ కామెంట్ చేశారు. నేను చరణ్ కు ఏకైక మేనమామనని.. మా ఇద్దరి మధ్య ఎక్సలెంట్ రిలేషన్షిప్ ఉందన్నాడు. ఇక్కడితో ఆ విషయాన్ని వదిలేయండి.. ఎవరైనా ఫీల్ అయితే సారీ అంటూ ఆ ఇష్యూ కి ఫుల్ స్టాప్ పెట్టారు. దీనితో ఇక మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ వేరు కాదని ఇద్దరు ఒకటే అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.