RC16పై మెగా ఫ్యాన్స్ టెన్షన్.. అంత తొందరేమొచ్చిందని గగ్గోలు

ట్రిపుల్ ఆర్ (RRR) మూవీతో పాన్ ఇండియా స్టార్ (Pan India Star) గా సత్తా చాటిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan).. చెర్రీ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్‌ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' (Game Changer) అనే మూవీ చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2024 | 03:19 PMLast Updated on: Jan 17, 2024 | 3:19 PM

Mega Fan Tension On Rc16

ట్రిపుల్ ఆర్ (RRR) మూవీతో పాన్ ఇండియా స్టార్ (Pan India Star) గా సత్తా చాటిన మెగా పవర్ స్టార్ (Mega Power Star) రామ్ చరణ్ (Ram Charan).. చెర్రీ నెక్స్ట్ మూవీ గురించి ఆయన అభిమానులంతా ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం చరణ్‌ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) అనే మూవీ చేస్తున్నాడు. అయితే.. శంకర్‌ వంటి డైరెక్టర్ చేతిలో పడ్డాక ఆ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉంటుందన్నది కచ్చితంగా చెప్పడం కష్టమే.. ఆ తర్వాత రామ్ చరణ్ కమిట్మెంట్స్ ప్రకారం ‘ఉప్పెన ‘ ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబుతో నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ కాగానే రామ్ చరణ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కానున్నాడు. అయితే.. ఇప్పుడు RC16 కు (Rc 16 ram charan) సంబంధించిన కొన్ని విషయాలు మెగా ఫ్యాన్స్‌కు టెన్షన్ పెడుతున్నాయి.

ఉప్పెనతో మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చి బాబు.. చెర్రీతో సినిమాను భారీ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఈ సినిమా కూడా పీరియాడికల్ మూవీగా వస్తుందని టాక్.. ఈ ఇయర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్నారన్న వార్త ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతోంది. నిజానికి పాన్ ఇండియా రిలీజ్ అనుకుంటున్న ఏ సినిమా అయినా కనీసం రెండేళ్లు సెట్స్ మీద ఉంటుంది. అలాంటిది ఆర్సీ 16 ఈ ఇయర్ మొదలు పెట్టి నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ అంటే ఎలా అంటూ ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. అంత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీని అంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు. హర్రీ బర్రీగా మూవీని కంప్లీట్ చేస్తే బుచ్చి బాబు అనుకున్న రేంజ్‌లో మూవీని పూర్తి చేయగలడా..? చెర్రీకి వావ్ అనిపించేలా హిట్‌ను అందించగలడా అంటూ డౌట్ పడుతున్నారు.

ఇక.. ఇప్పటికే RC 16 సమ్మర్ రిలీజ్‌పై డౌట్ మీద ఉన్న మెగా ఫ్యాన్స్‌కు మరో టెన్షన్ కూడా వెంటాడుతోంది. రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ బర్త్ డే సందర్భంగా RC 16 కు ఆయనే సంగీతం అందించబోతున్నారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. అయితే అప్పటిపూర్తికి చరణ్ అభిమానులు ఎగ్జైట్ అయినా, ఆ తర్వాత రెహమాన్ కు సంబంధించిన నెగెటివ్ సెంటిమెంట్ గుర్తు రావడంతో ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. తెలుగులో రెహమాన్ సంగీతం అందించిన ఒక్క సినిమా కూడా ఇప్పటిదాకా హిట్ అవ్వలేదు. డబ్బింగ్ సినిమాలకు ఎవర్గ్రీన్ మ్యూజిక్ అందించిన రెహమాన్ టాలీవుడ్ హీరోలకు మాత్రం అస్సలు కలిసిరాలేదు. ఆయన మ్యూజిక్ అందించిన స్ట్రైట్ తెలుగు సినిమాలు అట్టర్ ప్లాప్ గా నిలిచాయి. దీంతో ఆయన తెలుగు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను తలుచుకుని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కొంతమంది మాత్రం RC 16 మూవీకి అందించబోయే మ్యూజిక్ తో ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను రెహమాన్ బ్రేక్ చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి మెగా ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న ఈ విషయాల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి..