ఎక్కడ చెడిందో తెలియదు గానీ ఇప్పుడు మెగా వెర్సెస్ అల్లు వార్ మాత్రం ఆగడం లేదు. అల్లు అర్జున్ పేరు వింటే మెగా ఫాన్స్ శివాలెత్తిపోతున్నారు. అల్లు అర్జున్ టార్గెట్ గా సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో మెగా ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి సంబంధం లేదని మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి అల్లు అర్జున్ ట్రై చేస్తున్నాడంటూ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తిట్టడం మొదలుపెట్టారు. ఇక చిరంజీవి లేకపోతే అసలు అల్లు అర్జున్ ఎవరు అంటూ మెగా ఫాన్స్ ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ బిహేవియర్లో మార్పులు రావడం, మెగా ఫ్యామిలీ ఇమేజ్ నుంచి బయటికి రావాలి అనుకోవడం వంటివి అస్సలు మెగా ఫాన్స్ కు నచ్చట్లేదు. దీనితో పుష్ప సినిమాను ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ బాగా టార్గెట్ చేశారు. మెగా ఫ్యామిలీ పరువు తీసాడని అతన్ని మళ్లీ మెగా ఫ్యామిలీలో కలుపుకోవద్దు అంటూ ఎవరి కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ టైం లో కూడా అల్లు అర్జున్ టార్గెట్ చేయడం ఇంట్రస్టింగ్ గా ఉంది. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ ఉండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనబడుతోంది. ఇక అక్కడ మీడియా కూడా గట్టిగానే హడావుడి చేయడం మొదలు పెట్టింది. దీనితో మెగా ఫాన్స్ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకొని చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీతో ఉన్నంతవరకే పుష్ప ఎవరైనా.. మెగా ఫ్యామిలీని పక్కన పెడితే వాళ్ళందరూ వెర్రి పుష్పాలు అంటూ తిట్టడం మొదలుపెట్టారు. చిరంజీవి గారు లేకపోతే అసలు మెగా ఫ్యామిలీ లేదని.. పుష్ప అనే వాడే ఉండేవాడు కాదు అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీని కాదని బయటికి వెళ్లిన వాడు కచ్చితంగా వెర్రి పుష్పమే అంటూ బూతులు తిడుతున్నారు. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మాత్రమే అని పాన్ ఇండియా స్టార్లు ఎవరూ లేరు అంటూ ట్రోల్ చేస్తున్నారు మెగా ఫాన్స్. గేమ్ చేంజర్ రిలీజ్ టైం వరకే పుష్ప అని ఆ తర్వాత వెర్రి పుష్పం అంటూ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా సక్సెస్ అయితే మాత్రం కచ్చితంగా మెగా ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. ఈ సినిమా కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు సినిమాపై చాలా హోప్ తో ఉన్నారు.[embed]https://www.youtube.com/watch?v=gZYvbIxgzkA[/embed]