ప్రభాస్ కల్కీ.. ఎన్టీఆర్ దేవర… రేంజ్ సునామీ గేమ్ ఛేంజర్ కి వస్తుందా..?

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీతో 1200 కోట్ల వసూళ్లు తెచ్చాడు. ఇది కొత్త విషయం కాదు.. కాని ఈ సినిమా రిలీజ్ కిముందు, రిలీజ్ అయ్యాక, ఆఖరికి ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చాక కూడా సెన్సేషన్ అయ్యింది. అవుతూనే వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2024 | 12:25 PMLast Updated on: Nov 01, 2024 | 12:25 PM

Mega Fans Hope On Game Changer

రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీతో 1200 కోట్ల వసూళ్లు తెచ్చాడు. ఇది కొత్త విషయం కాదు.. కాని ఈ సినిమా రిలీజ్ కిముందు, రిలీజ్ అయ్యాక, ఆఖరికి ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి వచ్చాక కూడా సెన్సేషన్ అయ్యింది. అవుతూనే వచ్చింది. కట్ చేస్తే ఆతర్వాత దేవర వంతొచ్చింది. దేవర రిలీజ్ కి ముందు ఎంతగా హైప్ క్రియేట్ అయ్యిందో, విడుదలయ్యాక అంతకుమించి సెన్సేషన్ అయ్యింది. ఇక ఓటీటీలోకి వచ్చేనెల 8 కి వస్తోందంటేనే డిజిటల్ ప్లాట్ ఫాం ఊగిపోయేలా ఉంది. ఇలా ప్రభాస్ మూవీకి, ఎన్టీఆర్ సినిమాకు భారీగా స్పందనొచ్చింది. జనాల్లో ఎగ్జైట్ మెంట్ కనిపించింది. ఆరేంజ్ హైప్, సెన్సేషన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి దక్కుతుందా? ఎందుకంటే శంకర్ భారతీయుడు 2 డిజాస్టర్ అవటంతో, ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద పడుతుందన్నారు. విడుదల వాయిదా వేశారు. కనీసం సంక్రాంతికి చరణ్ వస్తే, కల్కీ, దేవర రేంజ్ హైప్ వస్తుందా? మెల్లిగా ప్రమోషన్ తో సీన్ మారుతోందా? ఇండస్ట్రీలోనే కాదు, ట్రేడ్ వర్గాల మాటలతో ఏం తేలింది?

పాన్ ఇండియా మూవీ వస్తోందంటే ఆ సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వాలి. అంచానాలు ఆకాశాన్నంటాలి.. లాస్ట్ ఇయర్ సలార్ వచ్చే ముందు సౌత్, నార్త్ అంతటా పూనకాలు వచ్చాయి. వాటికి తగ్గట్టే 750 కోట్ల వసూళ్లొచ్చాయి. కట్ చేస్తే ఏడాది తర్వాత కల్కీ 2 రిలీజ్ కిముందు ఇలాంటి హైపే వచ్చింది. 1200 కోట్ల వసూళ్లకి ఆ హైపే కారణమైంది. ఆతర్వాత దేవర దరువు మొదలైంది.

దేవర విడుదలకుముందు ఓటీటీ రైట్స్, ఓ వర్ సీస్ రైట్స్, నార్త్ ఇండియా లో పెరిగిన హైప్ ఇవన్నీ సినీ సునామీకి కారణమయ్యాయి. వెయ్యికోట్ల వైపు దేవర దరువు కంటిన్యూ అయ్యేందుకు కారణమయ్యాయి. కట్ చేస్తే ఇప్పడు సీన్లో కి వచ్చింది పుష్ప 2.

ఈ సినిమా రిలీజ్ కిముందే 999 కోట్ల బిజినెస్ చేసింది. విడుదలయ్యాక ఈజీగా 1000 కోట్ల వసూళ్లని రాబడుతుందనేంత అంచనాల భారం పెరిగింది. నిజంగా చెప్పాలంటే వెయ్యికోట్ల పుష్ప 2 వసూళ్లు కేవలం లాంచనమే.. వాటి నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది..

ఆరేంజ్ లో పాన్ ఇండియా లెవల్లో భారీగా అంచానాలున్నాయి. కాబట్టి పుష్ప 2 ఏమాత్రం బాగుందనే టాక్ వచ్చినా 1000 కోట్లుకాదు ఏకంగా 1500 కోట్లొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. మరి దీనికి గేమ్ ఛేంజర్ కి పోలికఏంటనే డౌట్ ఎవరికైనా రావొచ్చు. సలార్, కల్కీ, దేవర తో పోలిస్తే అన్నీంట్లో కామన్ భూమి బద్దలైపోయేంత అంచనాలు.. భారీగా పెరిగే హైప్.. ఇవే ఈసినిమాల ఓపెనింగ్స్ ని వందలకోట్ల స్థాయికి చేర్చాయి.

సో అలానే పుష్ప 2 కి జరగిలే ఉంది.. కాని గేమ్ ఛేంజర్ కి అలాంటి హైప్ వస్తుందా? అసలే శంకర్ డైరెక్షన్ లో వచ్చిన భారతీయుడు 2 డిజాస్టరైంది. ఆ సినిమా తీసిన దర్శకుడే గేమ్ ఛేంజర్ తీశాడు కాబట్టి, ఎక్కడా ఆ రిజల్ట్ ఈమూవీని ఎఫెక్ట్ చేస్తుందో అన్న భయంతో విడుదలని ఏకంగా సంక్రాంతికి వాయిదా వేశారు

కాబట్టి భారతీయుడు 2 ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ మీద పడకపోతే అది ప్లస్ అయ్యే చాన్స్ ఉంది. కాని పాన్ ఇండియా లెవల్లో గేమ్ ఛేంజర్ దుమ్ముదులపాలంటే, భారీ ఓపెనింగ్స్ రావాలంటే, దేవర, కల్కీ రేంజ్ లో జనాల అటెన్షన్ లాక్కోవాలి. ఆరేంజ్ లో హైప్ క్రియేట్ కావాలి… అదే జరుగుతుందా అంటే, ప్రజెంట్ పాటలతో మెల్లిగా ప్రమోషన్ పెంచుతోంది ఫిల్మ్ టీం. ఏదైనా మ్యాజిక్ జరగాలంటే గ్లింప్స్ లేదా, టీజర్ కాదంటే ట్రైలర్ దుమ్ముదులపాలి.. అదేజరిగిందే గేమ్ ఛేంజర్ గేమ్ నిజంగానే ఛేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది.