టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంలో రామ్ చరణ్ కూడా మెయిన్ లో ప్లే చేశాడు. ఇక రాజమౌళి కూడా ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి ఎక్కువగా వెయిట్ ఇవ్వడంతో మెగా ఫాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత బొమ్మ తిరగబడింది. ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా కూడా రామ్ చరణ్ కు షాక్ ఇచ్చింది. ఆ సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న మెగా అభిమానులు... తండ్రి కొడుకులతో కొరటాల శివ సూపర్ హిట్ కొడతారని ఎదురు చూశారు. కానీ తీరా సినిమా చూశాక భారీగా ట్రోల్ అయింది. ఇక లేటెస్ట్ గా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా ఎన్నో ఆశలతో వచ్చింది. తీరా చూస్తే ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక వసూళ్ల విషయంలో కూడా సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ వస్తున్నాయి. ఒకవైపు సినిమా బాగాలేదని సోషల్ మీడియాలో అభిమానులే కామెంట్స్ చేస్తుంటే ఏకంగా మొదటి రోజు 186 కోట్లు గేమ్ చేంజర్ సినిమా వసూలు చేసింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అభిమానులు కూడా తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా అది ఫేక్ కలెక్షన్ అంటూ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేస్తున్నారు. ఇక అదంతా పక్కన పెడితే ఇప్పుడు రామ్ చరణ్ ఏం చేయబోతున్నాడనే దానిపైన మెగా ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఎలాగైనా సరే పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ హిట్టు కొడితేనే గ్లోబల్ స్టార్ అనే టైటిల్ కు న్యాయం చేసినట్లు అవుతుంది. ఇప్పటికే మ్యాన్ ఆఫ్ ది మాసేస్ అనే టైటిల్ కు ఎన్టీఆర్ న్యాయం చేశాడు. ఇక రామ్ చరణ్ కోసమే అభిమానులు ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఎదురు చూస్తే శంకర్ కొట్టిన దెబ్బకు మెగా అభిమానులకు దిమ్మతిరిగిపోయింది. ఈ టైంలో బుచ్చిబాబు పైన హోప్స్ పెట్టుకున్నారు మెగా అభిమానులు. సుకుమార్ శిష్యుడు కావడం, మాస్ ఆడియన్స్ కు దగ్గర అయ్యేవిధంగా సినిమా చేయడంలో మంచి స్కిల్ ఉండడంతో బుచ్చిబాబుపై అభిమానుల్లో ఒక రకమైన నమ్మకం క్రియేట్ అయింది. దీనితో మెగా అభిమానులు బుచ్చిబాబును రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎలాగైనా సరే హిట్టు కొట్టి మెగా ఫ్యామిలీకి తిరుగులేని రికార్డులు ఇవ్వాలి అంటూ బ్రతిమిలాడుతున్నారు. ఒకవేళ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయితే మాత్రం రామ్ చరణ్ కంటే ముందు మెగా ఫాన్స్ తల ఎత్తుకోలేని పరిస్థితి. పుష్ప సినిమాను దేవర సినిమాను దారుణంగా ట్రోల్ చేసిన మెగా ఫాన్స్ ఒకరకంగా డిఫెన్స్ లో పడిపోయారు. వేరే హీరోలను ట్రోల్ చేయడం కంటే కూడా తమ హీరోని ఎలా సేవ్ చేసుకోవాలనే దానిపైనే వాళ్ళ ఫోకస్ ఉంది.[embed]https://www.youtube.com/watch?v=cVb1IB2lzO0[/embed]