Spl story: బన్నీ అంటే జలసీ ఎందుకు?
ఆ ఒక్కడికి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ఫామ్‌లో వుంది అల్లు అర్జున్ ఒక్కడే. మూడేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టి ఆతర్వాత కనిపించని అల్లు అర్జున్ డిసెంబర్ 5న పుష్ప2తో బరిలోకి దిగుతున్నాడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి.
ఆ ఒక్కడికి తప్ప మెగా హీరోలందరికీ హిట్ కావాలి. మెగా హీరోల్లో ఫామ్‌లో వుంది అల్లు అర్జున్ ఒక్కడే. మూడేళ్ల క్రితం పుష్పతో హిట్ కొట్టి ఆతర్వాత కనిపించని అల్లు అర్జున్ డిసెంబర్ 5న పుష్ప2తో బరిలోకి దిగుతున్నాడు. అదేమిటో మెగా హీరోలను ఫ్లాపులు వెంటాడుతున్నాయి. చిరంజీవి నుంచి పిల్ల మెగా హీరోల వరకు ఒక్కరికి గట్టి హిట్ పడలేదు. మెగా హీరోలు వరుస ఫ్లాపులతో గాడి తప్పారు. ముఖ్యంగా వరుణ్‌తేజ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తప్ప మరో హిట్ పడలేదు. ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా… విజయం మాత్రం వరించడం లేదు. ఎప్పిటకప్పుడు ఈసారి అలరించే కథతో వస్తానని ఫ్యాన్స్‌కు ప్రతిసారీ మాటిచ్చి తప్పుతూనే వున్నాడు. వరున్‌తేజ్ సినిమా అంటే ఫ్లాప్ గ్యారెంటీ అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చేయడంతో ఆడియన్స్ పట్టించుకోవడం మానేశాడు. వరుణ్ మూవీ ఐదు కోట్లు కూడా రాబట్టలేకపోతోంది.
హీరో కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన మట్కా అయితే నాలుగు రోజులో కోటి 25 లక్షలు మాత్రమే తీసుకొచ్చింది. లాంగ్ రన్ సంగతి తర్వాత సంగతి.. రిలీజ్ రోజే డెఫిషిట్‌లో పడిపోయింది. గని.. గాండీవధారి అర్జున… ఆపరేషన్ వాలెంటైన్. లేటెస్ట్‌గా మట్కాతో వున్న క్రేజ్ పోగొట్టుకున్నాడు వరుణ్. ఆచార్య… గాడ్‌ఫాదర్ వంటి వరుస ఫ్లాపుల తర్వాత వాల్తేరు వీరయ్యతో మెగా బాస్ ఫామ్‌లోకి వచ్చాడు. 136 కోట్లు కలెక్ట్ చేసి ‘అల వైకుంఠపురంలో’ మీదున్న నాన్ ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. అయితే ఆ సంతోషాన్ని భోళా శంకర్ ఆవిరి చేసేసింది. చిరంజీవి కెరీర్‌లో ఆచార్యనే డిజాస్టర్ అనుకుంటే..భోళా శంకర్ అంతకు మించి నష్టాలు తీసుకొచ్చింది.దీంతో మెగాస్టార్ రీమేక్ మూవీస్ అంటే భయపడిపోయాడు. సోగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో నటించాల్సిన రీమేక్ మూవీని పక్కన పెట్టి స్ట్రైట్ స్టోరీ ‘విశ్వంభర’ చేస్తున్నాడు. సినిమా సంక్రాంతికి రావాల్సిన వున్నా.. విఎఫ్‌ఎక్స్ ఆలస్యం కావడంతో 2025 సమ్మర్‌లో విడుదలవుతోంది. పవన్ రీ ఎంట్రీ మూవీస్ వకీల్‌సాబ్, భీమ్లానాయక్ ఓకె అనిపించుకున్నా.. బ్రో సినిమా వీకెండ్ కలెక్షన్స్‌కే పరిమితమైంది.
సినిమాను 90 కోట్లకు అమ్మడితే.. 70 కోట్లు కూడా రాలేదు. పొలిటికల్‌గా సక్సెస్ అయిన పవర్‌స్టార్ మార్చి 28న వస్తున్న హరిహర వీరమల్లుతో వెండితెరపైన కూడా ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలిమరి. సాయి తేజ్ విరూపాక్షతో దాదాపు 100 కోట్ల గ్రాస్ దాకా వెళ్లాడు. మేనమామ పవన్ కల్యాణ్ అండతో హిట్ కొడదామనుకుంటే.. బ్రో బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో.. రూటు మార్చి లావిష్ మూవీతో రావాలని ట్రై చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రోహిత్‌తో వర్క్ చేస్తున్న కొత్త సినిమా వీడియో చూస్తుంటే.. హీరో డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నాడనిపిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌తో రామ్‌చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. శంకర్ చేతిలో పడ్డాడు ఇంకేముందనుకుంటే.. ఆచార్య ఈ మెగా హీరోను డిజప్పాయింట్ చేసింది. చెర్రీ సక్సెస్ చూడాలంటే..
‘గేమ్ ఛేంజర్’ థియేటర్ష్‌లోకి వచ్చే జనవరి 10వ వరకు వెయిట్ చేయాలి. వైష్ణవ్‌తేజ్ ఉప్పెనతో అదిపోయే ఎంట్రీ ఇచ్చినా.. రెండో సినిమా కొండపొలం నిరాశపరిచింది. ‘రంగ రంగ వైభవంగా’.. ఆదికేశవ డిజాస్టర్స్ నుంచి కోలుకోలేని ఈ మెగా యంగ్ హీరో టైం తీసుకున్నాడు. నెక్ట్స్ మూవీ ఇంకా ప్రకటించకపోయినా.. కృష్ణ చైతన్య డైరెక్షన్‌లో నటిస్తాడని.. ‘వచ్చాడయ్యో సామి’ అన్న టైటిల్ అనుకున్నట్టు తెలిసింది. ఉప్పెన లాంటి మెగా సక్సెస్ పడితేగానీ..వైష్ణవ్ ఫామ్‌లోని రాలేడు. అందుకే మెగా హీరోలంతా ఒక్క హిట్ స్వామి అని దేవ్వుణ్ణి మొక్కుతున్నారు. బన్నీ మాత్రం తగ్గేదేలే అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు