దేవరతో చేతులే కాలాయి, పుష్పతో బాడీ కాల్చుకుంటారా…?

వేరే భాషల్లో ఎంత వరకు ఉందో తెలియదు గాని... మన తెలుగులో మాత్రం యాంటీ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంది. దేవర సినిమాతో తాము ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్న యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు పుష్ప 2 తో తాండవం ఆడే కార్యక్రమం మొదలుపెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 19, 2024 | 01:22 PMLast Updated on: Nov 19, 2024 | 1:22 PM

Mega Fans Target Pushpa 2 Movie

వేరే భాషల్లో ఎంత వరకు ఉందో తెలియదు గాని… మన తెలుగులో మాత్రం యాంటీ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంది. దేవర సినిమాతో తాము ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్న యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు పుష్ప 2 తో తాండవం ఆడే కార్యక్రమం మొదలుపెట్టారు. దేవరపై కోపం కంప్లీట్ అయింది… చేతులు కాల్చుకున్నారు… కాని ఇప్పుడు పుష్పను టార్గెట్ చేస్తున్న విధానం చూస్తే కచ్చితంగా బాడీ మొత్తం కాల్చుకోవడం ఖాయంగా కనపడుతోంది. దేవరను యాంటీ ఫ్యాన్స్ ఎంత టార్గెట్ చేసినా బాక్సాఫీస్ లో తొడకొట్టాడు.

కాని పుష్ప మాత్రం బాక్సాఫీస్ పై నుంచి తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు… మూడు కాదు… పుష్ప అయిదేళ్ళ కష్టం… పుష్ప సీరీస్ కోసం బన్నీ ఎంత తీసుకున్నాడు… మైత్రీ వాళ్ళు ఎంత ఇచ్చారన్నది లెక్క కాదు… పుష్ప కోసం బన్నీ ఎంత టైం ఖర్చు చేసాడన్నదే ఇప్పుడు లెక్క. ట్రైలర్ కట్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఫ్యాన్స్ కంటే ఆడియన్స్ సినిమా కోసం పిచ్చ పిచ్చగా ఎదురు చూస్తూ ప్రీ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

సినిమా విషయంలో బన్నీ కూడా చాలా పక్కా లెక్కతో ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేసాడు. సినిమా కోసం తాను పెట్టిన ఎఫర్ట్ ప్రపంచానికి క్లియర్ కట్ గా చూపించడానికి బన్నీ రెడీ అయిపోయాడు. ప్రమోషన్స్ ను నార్త్ లో ట్రైలర్ తో లాంచ్ చేసిన విధానం చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. గతంలో ఏ బాలీవుడ్ హీరో మూవీకి ఈ రేంజ్ లో ప్రమోషన్స్ జరగలేదు. ట్రైలర్ లాంచ్ కోసం ఇంత గ్రాండ్ గా ప్లాన్ చేయడం వెనుక… భారీ బజ్ హిందీలో క్రియేట్ చేయడమే

సౌత్ కంటే నార్త్ లో ఎక్కువ ఈవెంట్స్ ప్లాన్ చేసారు మేకర్స్. ఇది పక్కన పెడితే… పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ కు భారీగా జనాలు హాజరు అయ్యారు. సౌత్ సినిమాకు ఈ రేంజ్ లో జనాలు రావడం ఇదే తొలిసారి. ఇక ఇది చూసి… యాంటీ ఫ్యాన్స్ కు పిచ్చి లేస్తోంది. అందుకే పుష్పను సోషల్ హ్యాండిల్స్ లో టార్గెట్ చేస్తున్నారు. బన్నీ నడిచి వెళ్ళే టైం లో ఫ్యాన్స్ ఒత్తిడి కారణంగా కాస్త ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు బన్నీ చూసిన చూపును ట్రోల్ చేస్తూ ఈ యాటిట్యూడ్ తగ్గించుకుంటే బాగు పడతావ్ బ్రో అంటూ అడ్వైజ్ లు కొందరు ఇస్తే కొందరు తిట్టడం స్టార్ట్ చేసారు. ఇక ట్రైలర్ ను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు. చెప్పులు విసిరిన ఘటనపై కూడా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడి నుంచి పుష్ప అప్డేట్స్ స్టార్ట్ అవుతాయి… ట్రోలింగ్ కూడా పీక్స్ లో స్టార్ట్ కావడం ఖాయం… పుష్ప ది రూల్ ట్రైలర్ తోనే ఆడియన్స్ కు సినిమాపై క్లారిటీ వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత యాంటీ ఫ్యాన్స్ కు రావడం ఖాయం అంటున్నారు బన్నీ ఫ్యాన్స్.