దేవర సినిమా తర్వాత నుంచి మెగా ఫాన్స్ చేసిన హడావుడి అంతా కాదు. సోషల్ మీడియాలో వేరే హీరోల సినిమాలను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నారు. కొంతమంది అయితే బూతులు కూడా తిడుతూ వేరే హీరోలను అవమానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తమ హీరోలను ఎక్కువగా ఊహించుకుని వేరే హీరోలను తక్కువ చేసి మాట్లాడడం సినిమాలు బాగున్న సరే బాగా లేదంటూ బూతులు తిట్టడం వంటివి కామన్ గా జరిగాయి. దేవర సినిమాకు అయితే ఒక రకంగా చుక్కలు చూపించారు. దీనితో సినిమా నిజంగానే బాగాలేదు అనుకుని చాలామంది సినిమా చూడటం కూడా మానేశారు. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ ఆ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమా విషయంలో కూడా అదే రేంజిలో ట్రోల్ చేశారు. సినిమా బాగా లేదంటూ అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తీరా చూస్తే ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టి 2000 కోట్లు వసూలు దిశగా వెళుతుంది. ఇక లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాను కూడా ఇలాగే టార్గెట్ చేశారు. ఈ సినిమా కూడా బాగా లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. గేమ్ చేంజర్ సినిమా బాగుందంటూ ఎలివేట్ చేసుకునే టైంలో డాకు మహారాజ్ సినిమాను టార్గెట్ చేయడం కామెడి అయింది. అయితే మెగా ఫాన్స్ టార్గెట్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. దేవర సినిమా దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత.. పుష్ప సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయం అనే అంచనాలు వినపడుతున్నాయి. అయితే ఇదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం అట్టర్ ప్లాప్ కావడం ఫాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. వరుణ్ తేజ్ సినిమా లాస్ట్ ఇయర్ మట్కా రిలీజ్ అయింది. ఆ సినిమా దారుణంగా ఉండటంతో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అనే ఒపీనియన్ వినపడుతోంది. దీనితో తర్వాత రాబోయే హరిహర వీరమల్లు, విశ్వంభరా సినిమాలపై మెగా ఫాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశ్వంబరా సినిమా టీజర్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా ఆడుతుందా అనే భయం లో కూడా కనబడుతున్నారు. అందుకే చిరంజీవి సినిమా విషయంలో తొందర పడకుండా చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అటు హరిహర వీరమల్ల సినిమాపై కూడా ఫ్యాన్స్ కు హోప్స్ తక్కువగానే ఉన్నాయి. సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం డైరెక్టర్ మారడం వంటివి కూడా ఫ్యాన్స్ కు హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి.