దేవరను ఇంకా వెంటాడుతున్న మెగా ఫ్యాన్స్, కరణ్ జోహార్ కు న్యాయమా…?

దేవర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అన్ని రకాలుగా టార్గెట్ చేయడం టాలీవుడ్ లో చికాకు పెట్టింది. ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉన్నా కూడా మెగా ఫ్యాన్స్ దేవర సినిమాను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పటికీ టాలీవుడ్ జనాలకు క్లారిటీ మిస్ అవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 06:01 PMLast Updated on: Oct 22, 2024 | 6:01 PM

Mega Fans Who Are Still Chasing Devara Is Justice For Karan Johar

దేవర సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ అన్ని రకాలుగా టార్గెట్ చేయడం టాలీవుడ్ లో చికాకు పెట్టింది. ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉన్నా కూడా మెగా ఫ్యాన్స్ దేవర సినిమాను ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఇప్పటికీ టాలీవుడ్ జనాలకు క్లారిటీ మిస్ అవుతోంది. ఎన్టీఆర్… ఈ విషయంలో సీరియస్ గానే ఉన్నా ఎక్కడా బయటపడటం లేదు. ప్రస్తుతం దేవర సినిమా సక్సెస్ ను ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయినా సరే వదలడం లేదు మెగా ఫ్యాన్స్. దేవర సినిమా వసూళ్లు భారీగా ఉన్నాయి.

అయినా సరే మెగా ఫ్యాన్స్ సైలెంట్ కావడం లేదు. ఏదోక రూపంలో టార్గెట్ చేస్తూ విక్రుతానంధం పొందుతున్న్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్… ధర్మ ప్రొడక్షన్ హౌస్ లో 50 శాతం ఆధార్ పూనావాలాకు అమ్మేశాడు. దానికి కారణం ఎన్టీఆర్ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హిందీలో దేవర సినిమా హక్కులను కరణ్ జోహార్ తీసుకున్నాడు. అక్కడ గట్టిగా ప్రమోట్ చేసాడు. దీనికి కూడా భారీగానే ఖర్చు చేసాడు. ఇదే సమయంలో అక్కడ భారీగా ప్రీ బుకింగ్ మార్కెట్ జరిగింది. ఫస్ట్ డే వసూళ్లు కూడా భారీగానే వచ్చాయి.

అయితే ఆ టికెట్స్ అండ్ ప్రమోషన్ ఖర్చు… దాదాపుగా వంద కోట్లు ఖర్చు చేసి కొన్నారని… ముందు ఎన్టీఆర్ తాను కూడా ఆ ఖర్చు భరిస్తా అని చెప్పాడని కాని… తర్వాత హ్యాండ్ ఇచ్చాడని ఆ లాస్ తట్టుకోలేక అమ్మేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఓ చిన్న లెక్క చూద్దాం… వాస్తవానికి గత కొన్ని రోజులుగా కరణ్‌ జోహార్‌ నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ ను అమ్మాలి అనుకుంటున్నాడు. దీనిపై బాలీవుడ్ చాలా రూమర్స్ వచ్చినా… ఎందుకు అలా నిర్ణయం తీసుకుంటాడు, లాభాల్లోనే ఉంది కదా అంటూ పలువురు కామెంట్ చేసారు.

కాని ఇప్పుడు అది నిజమే అని క్లారిటీ ఇచ్చాడు కరణ్. కరణ్ ‘ధర్మ’లోని 50% షేర్ ని ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలాకు రూ.1000 కోట్లకు అమ్మేశాడు. మరో 50% కరణ్ పేరు మీదే ఉండనుంది. అంటే అదొక వెయ్యి కోట్లకు పైగానే ఉంటుంది. ఈ నిర్మాణ సంస్థకి కరణ్ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ గా కొనసాగుతూ క్రియేటివ్ వర్క్స్ చేసుకుంటాడు. కరణ్ క్లోజ్ ఫ్రెండ్ అపూర్వ మెహతా సీఈవోగా ఉంటాడు. అంటే సినిమాకు వచ్చింది వంద కోట్ల లాస్ అయితే వెయ్యి కోట్ల విలువ చేసే షేర్ ని ఎందుకు అమ్ముతాడు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.