మెగా గ్యాంగ్ లీడర్ డ్రీమ్… ఎంతైనా ఎన్టీఆర్ తర్వాతే చిరు…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ హిట్స్ తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా తన ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు.
![మెగా గ్యాంగ్ లీడర్ డ్రీమ్… ఎంతైనా ఎన్టీఆర్ తర్వాతే చిరు… Mega Gang Leader Dream Anyway After Ntr](https://s3.ap-south-1.amazonaws.com/media.dialtelugu.com/wp-content/uploads/2025/02/pc7Q-CZ0pQ-HD-1.jpg)
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ హిట్స్ తో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా తన ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టాడు. చిరు ఫోటో తన ఇంట్లో ఉండటంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబర పడ్డారు. ఆ ఇమేజెస్ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. అంతవరకు బానే ఉంది. మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీయటం సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ అన్న మాట కూడా ఇప్పుడు వైరలౌతోంది. చాలా ఇంటర్వూల్లో ఎన్నోసార్లు చిరుతో సినిమానా అని ఆశ్చర్యపోయాడు సందీప్ .. అలాంటప్పుడు చిరుతో ఎందుకు సినిమా కమిట్ కాలేకపోతున్నాడు. ఆల్రెడీ రెబల్ స్టార్ తో స్పిరిట్ తీసేందుకు రెడీ అయ్యాడు. తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ ఉంది.. ఆ తర్వాతే ఎన్టీఆర్ తో సినిమా అంటున్నారు.. ఆ లెక్కన మ్యాన్ ఆఫ్ మాసెస్ తర్వాతే చిరంజీవితో సందీప్ రెడ్డి సినిమా ఉంటుందా? జస్ట్ వాచ్ ఇట్.
సందీప్ రెడ్డి వంగ ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి ఆరాధన మూవీ తాలూకు ఫోటో ఒకటి కనిపించింది. ఆ పిక్ ని తానే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆమధ్య మాస్టర్ లో సిగరెట్ తాగుతూ తాను సీరియస్ గా డైలాగ్ చెప్పే సీన్ లో చిరు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడో కూడా చెప్పాడు. ఈ రెండు సంఘటనలతో సందీప్ రెడ్డి వంగ మెగా అభిమాని అని ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. పవర్ స్టార్ అంటే కూడా తనకి పిచ్చి అభిమానమని ఆల్రెడీ తేల్చాడు
ఐతే ఇంత అభిమానం ఉంది… చిరుతో సినిమా తీయాలనేది తన డ్రీమ్ అని తన ఇంటర్వూస్ చూస్తే ఎవరికైనా అర్ధమౌతుంది.. కాని ఆ సెన్సెషనల్ కాంబినేషన్ మాత్రం ఓకే కాలేదు. ప్రజెంట్ రెబల్ స్టార్ తో స్పిరిట్ ని ఉగాదికి లాంచ్ చేసి, జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తెరకెక్కుతుంది.
ఆతర్వాతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో సినిమా ఉండొచ్చట. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్ లీడర్ రేంజ్ మూవీ తీయాలనేది సందీప్ ప్లానింగ్ అనితెలుస్తోంది. మరి పుష్ప2 రిలీజ్ కిముందే ఎనౌన్స్ చేసిన అల్లు ఆర్జున్ ప్రాజెక్ట్ పరిస్థితేంటంటే, అక్కడ ఆన్సర్ లేదు. వరుసగా ప్రభాస్, రణ్ బీర్ కపూర్, ఎన్టీఆర్, చిరులతో సినిమాలు ప్లాన్ చేస్తూ ట్రెండ్ సెట్టింగ్ ప్లానింగ్ తోదూసుకెళుతున్నాడు సందీప్.
అంతా బానే ఉంది కాని, చిరు లాంటి స్టార్ కమ్ ఆర్టిస్ట్ తో సందీప్ రెడ్డి సినిమా అంటే డెఫినెట్ గా ఒకప్పటి చిరుని ఊహించుకుంటారు. ఖైదీ నెంబర్ 150 నుంచి మొన్నటి ఆచార్య, భోళా శంకర్ వరకు చిరు ఎక్కువగా కామెడీ మాస్ డ్రామాలే చేశాడు. సీరియస్ మాస్ ఎమోషనల్ డ్రామా మాత్రం రావాలంటే, అది సందీప్ రెడ్డి వంగలాంటి మేకర్ డైరెక్షన్ లోనే సాధ్యం.
కొత్తగా చిరులో మరో కోణాన్ని చూపించే ప్రయత్నం సందీప్ రెడ్డి చేయాలనకుంటున్నాడు. చిరుతో సినిమా తన డ్రీమ్ అని ఎప్పుడో తేల్చాడు. సో కరెక్ట్ కథ కుదిరితే, మెగా ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందట. ఎంత చిరుతో తను సినిమా తీసేందుకు మెంటల్ గా ప్రిపేర్ అయినా, స్పిరిట్, యానిమల్ పార్క్, తర్వాత ఎన్టీఆర్ మూవీ తీశాకె, మెగా కాంపౌండ్ లో అడుగుపెడతాడట సందీప్.