మెగా గ్లోబల్ స్టార్… మరీ మంచు స్టారైపోయాడా…?
మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కేవలం గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. ఎన్టీఆర్ ఒక వైపు త్రిబుల్ ఆర్ తర్వాత దేవరగా దూసుకెళ్లాడు

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ కేవలం గేమ్ ఛేంజర్ ఫ్లాప్ తో ఎక్కడికో వెళ్లిపోయింది. ఎన్టీఆర్ ఒక వైపు త్రిబుల్ ఆర్ తర్వాత దేవరగా దూసుకెళ్లాడు. వార్ 2 తోపాటు, డ్రాగన్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉందనే అంచనాలు పెరుగుతున్నాయి. కాని తనతో త్రిబుల్ ఆర్ లో స్క్రీన్ షేర్ చేసుున్న చరణ్ జర్నీలో బ్రేకులు, షాకులు పెరిగిపోయాయి. ఆచార్య, గేమ్ ఛేంజర్ తో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడటంతో మెగా గ్లోబల్ ఇమేజ్ కి డ్యామేజ్ రిపేర్ చేయని స్థాయిలోపెరిగిందా..? అందుకే చరణ్ తోటి స్టార్స్ సాయం తీసుకుంటున్నాడా? ఈ డౌట్లు రావటానికి బుచ్చి బాబు మూవీనే కారణం. బేసిగ్గా మెగా హీరోలెవరికి, మెగాఫ్యాన్స్ లేదంటే, తోటి మెగా హీరోలే బిగ్గెస్ట్ సపోర్ట్… అయినా ఈ సారి చరన్ కోసం పొరుగు హీరోలు సాయం చేయాల్సి వచ్చేలా ఉంది. ఇలా అనిపించటానికి, ఇలాంటి కామెంట్లకు కారణం, ఫస్ట్ టైం తన సినిమాలో తనకంటే ఎక్కువగా మిగతావాళ్లు ఫోకస్ అవుతుండటం. ఆ మాత్రానికే మంచు హీరోతో తనని పోలుస్తున్నారా? అంటే అక్కడే ట్విస్ట్ ఇచ్చేలాజిక్ ఉంది. కన్నప్పలో మంచు విష్ణు సైడ్ హీరో అయితే, గెస్టులే మేయిన్ హీరోలంటున్నారు. అచ్చంగా అలాంటి పరిస్థితే రామ్ చరణ్ కొత్త మూవీకి వచ్చిందంటున్నారు.. అదెలానో చూసేయండి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతున్నాడు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్.తనకు హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా చరణ్ కోసం తను బుచ్చి బాబు మూవీలో స్పెషల్ రోల్ వేస్తున్నాడు. చరణ్ ఇందులో అథ్లెట్ గా కనిపిస్తుంటే,తనకి కోచ్ గా శివరాజ్ కుమార్ కనిపిస్తాడంటున్నారు. అయితే ఇక్కడ ఎవరే పాత్ర వేస్తున్నారనేది మ్యాటర్ కాదు. మెగా స్టార్ వారసుడిగా మగధీరతో మాస్ హీరోగా, త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన చరణ్ కి, ఉన్న ఫలంగా తోటి హీరోల సపోర్ట్ కావాల్సి వచ్చింది.ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి వరుస డిజాస్టర్ తో పాన్ ఇండియా రేసులో తను వెనకబడటం వల్లే, తోటి హీరోలు, టెక్నీషియన్స్ సపోర్ట్ కావాల్సి వస్తోంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మరో హీరోనో, టెక్నీషియనో వచ్చి తనకి సపోర్ట్ చేస్తే తప్ప పాన్ ఇండియా లెవల్లో తను గట్టెక్కలేని పరిస్థితి ఉందా? ఈ డౌట్ రావటానికి చరణ్ మూవీ లో కనిపిస్తున్న ప్యాడింగ్ కారణం.
పెద్ద హీరో కొడుకో, టెక్నీషియన్ వారసుడో హీరోగా కొత్తగా వస్తున్నాడంటే, తనకి సపోర్ట్ అయ్యేందుకు తెలిసిన పెద్ద స్టార్స్ ని సినిమాలోకి తీసుకుంటారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్, సక్సెస్ ఫుల్ దర్శకుడి సాయం తీసుకుని వారసుడి లాంగ్ గ్రాండ్ గా ఉండేలా చేస్తారు. అలా చూస్తే చరణ్ కొత్త హీరో కాదు, మాస్ మీద పట్టున్న మాంచి ఎక్స్ పీరియన్స్ హీరో… కాని తనకి కూడా ప్యాడింగ్ అవసరమైనట్టుంది.దేవరతో హిట్ మెట్టెక్కిన జాన్వీ కపూర్ ని ఆల్రెడీ చరణ్ మూవీకి హీరోయిన్ గా తీసుకున్నప్పుడే నార్త్ ఇండియా మార్కెట్ లో అటెన్షన్ పెరిగింది. నార్త్ లో త్రిబుల్ ఆర్ తో చరణ్ కి ఎంత పాపులారిటీ ఉన్నా, అక్కడి హీరోయిన్ సినిమాలో ఉంటే పెరిగే రీచే వేరు. దీనికి తోడు ఆస్కార్ అచీవర్ ఏ ఆర్ రెహమాన్ ని రంగంలోకి దింపారు. ఇప్పుడు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని తీసుకుంటున్నారు. ఇదే మంచు విష్ణుతో చరణ్ నిపోల్చేలా చేస్తోంది.
మంచు విష్ణుకి సరైన హిట్లు లేక మార్కెట్ లేకుండా పోయింది. అలాంటి హీరో 200 కోట్లు పెట్టి పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడంటే చూసేదెవరు.. అందుకే బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, తెలుగు నుంచి ప్రభాస్ ఇలా అసలు హీరో కంటే, సపోర్ట్ ఇచ్చే హీరోలతోనే కన్నప్ప నిండిపోతోందనే కామెంట్లు పెరిగాయి..మరీ మెగా గ్లోబల్ స్టార్ చరణ్ పరిస్థితి అంత ఘోరంగా లేదు, డజన్ ఫ్లాపులు పడ్డా అప్పడిప్పుడే అలంటి సీన్ ఉండదు. కాని పాన్ ఇండియా రేసులో ఒక్క అడుగు వెనక్కి పడ్డా, అడ్రస్ గల్లంతవుతుంది. అందుకే మెగా ఇమేజ్ ఎంత ఉన్నా, చరణ్ మూవీ పెద్దికి తోటి హీరోలే కాదు క్రికెటర్ల సపోర్ట్ కూడ
తీసుకుంటున్నట్టున్నారు. జాన్వీ కపూర్, రెహహాన్, కన్నడ శివరాజ్ కుమార్, తోపాటు మాజీ క్రికెట్ ప్లేయర్ ధోనీని కూడా గెస్ట్ గా ఇందులో వాడబోతున్నారు.