మెగా తప్పు చేస్తున్నాడు.. మళ్లీ మెగా టంగ్ స్లిప్…

మెగా స్టార్ మొన్న మంచి మాట చెబుతున్నాననుకుంటూ, కాంపౌండ్ అనే తేనే తుట్టెను కదిపాడు. దాంతో ఆ మాట మిస్ ఫైర్ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2025 | 09:11 PMLast Updated on: Feb 13, 2025 | 9:11 PM

Mega Is Doing Wrong Mega Tongue Slip Again

మెగా స్టార్ మొన్న మంచి మాట చెబుతున్నాననుకుంటూ, కాంపౌండ్ అనే తేనే తుట్టెను కదిపాడు. దాంతో ఆ మాట మిస్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు మరో రెండు మాటల తూటాలు పేల్చాడు. మెగా తప్పు మీద తప్పు చేస్తున్నాడనే నిందను ఫేస్ చేస్తున్నాడు. ఒకటి తనకి లేడీస్ అంటే లెక్కేలేదనే అర్ధమొచ్చేలా స్టేట్ మెంట్ ఇచ్చాడు. రెండు తన ముత్తాత కంటే తాను మంచోడినని అనిపించుకోబోయి, ఇంకో సారి టంగ్ స్లిప్ అయ్యాడు. ఇప్పటి వరకెన్నడు చిరు ఇలా మాట్లాడటం చూడలేదన్న కామెంట్లు వచ్చాక కూడా, మెగా స్టార్ మాటల్లో మార్పులేదు. రోజుల తేడాతో బూజు పట్టిన మాటలు వదులుతూ, కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. కామెడీ కోసం లేడీస్ హాస్టల్ అని, మంచితనం కోసం రొమాంటిక్ కాదని, వారసత్వం కోసం మనవడని ఇలా మూడు మాటల తూటాలు పేల్చాడు. ట్రోలింగ్ ని ఫేస్ చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవికి చాదస్తం పెరిగిందా? లేదంటే సరదాగా ఎప్పటిలానే తను మాట్లాడే మాటల్లో, కావాలని అంతా తప్పులు తీస్తున్నారా…? ఈ ప్రశ్నలు సాధారణంగా తన యాంటీ ఫ్యాన్స్ మీద డౌట్స్ తో ఎవరైనా వేయొచ్చు. కాని రియాలిటీ చూస్తే అలాఏం లేదు. చిరంజీవి అంటే చిన్న కటౌట్ కాదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత టాలీవుడ్ కి ఆరేంజ్ లో దొరికిన ఆణిముత్యం.ఔట్ సైడర్ గా వచ్చి హిస్టరీ క్రియేట్ చేశాడు. ఎక్కడ ఏం మాట్లాడినా నొప్పించక తానొవ్వక అన్నట్టు మాట్లాడటం, తన స్పెషాలిటి.. కాని ఇప్పుడా స్పెషాలిటీనే తనలో మిస్ అవుతున్నట్టుంది. టచ్ చేయకూడని టాప్స్ ని టచ్ చేయటం, అప్రస్థుతం అనుకున్న విషయాలు గెలికి చెప్పటం లాంటివి ఈమధ్య తరుచుగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి

మొన్న లైలా ఈవెంట్ లో మెగా కాంపౌండ్, నందమూరి కాంపౌండ్స్ లేవన్నారు. అలా కాంపౌండ్ తేనె తుట్టెని కదిపాడు. ఇప్పుడు మరో ఈవెంట్ లో మూడు తప్పులు, మాటల్లో దొర్లేలా చేశాడు. టంగ్ స్లిప్ అయ్యి, కొత్త సమస్య తెచ్చుకున్నాడు..

తన తాత చాలా రొమాంటిక్ అని, అందుకే ఆయనకిద్దరంటూనే, ఇంక మూడో గడపతొక్కేవాడని, ఇంకా నాలుగు, ఐదో ఇలా ఆ నెంబర్ ఎక్కడ ఆగిందో అనేశాడు చిరు. తన తాతని ఇన్స్ పిరేషన్ గా తీసుకోవద్దని తనకి చెప్పటం, తను అలా కాకుండా పద్దతిగా ఉండటం మీద మాట జారాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ ట్వీట్ ని అంతా తవ్వి తీశాడు. వర్మ ఒకరిని పొగడాలంటే మరొకరిని కించపరచాలనే వ్యక్తిత్వం ఉన్నవాడని చిరు గతంలో అన్నాడు.సో ఇప్పుడు చిరు చేస్తోంది ఏంటి. తను మంచివాడిని అనిపించుకునేందుకు సొంతం తాతనే కించపరిచాడా? అన్న డౌట్లు పెరిగాయి. అసలు తన తాత రొమాంటిక్ నేచర్ ఎవరికి తెలుసు..? అదెందుకుప్రస్తావనకి వచ్చింది. అదంత అవసరమా… గతం గతంహా అని వదిలేయక అంటూ కామెంట్లు, ట్రోలింగ్స్ పెరిగాయి.

ఇదే తప్పంటే, తన ఇల్లు లేడీస్ హాస్టల్లా మొత్తం లేడీస్ తోనే నిండిపోయిందని, తనో వార్డెన్ లా మారానన్నాడు. అది కూడాఓకే కాని, మెగా లెగస్సీని ముందుకు తీసుకెళ్లాలంటే మనవడు కావాలన్నాడు. చెర్రీకి అదే చెప్పానన్నాడు. దీంతో క్లింకారా సరిపోదా? మనవడే వారసుడా? మనవరాలు వారసులాలిగా పనికి రాదా అనంటున్నారు..మొత్తంగా ఇండస్ట్రీలో కాంపౌండులనుంచి లేడీస్ హాస్టల్స్, మనవడి కోరిక, అలానే తాత రొమాన్స్ ఇల్లా తను మాట్లాడిన ప్రతీ మాట మిస్ ఫైర్ అవుతున్నాయి. వివాదాలుగా మారి, సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురౌతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ లా అవసరమైన విషయాలే మాట్లాడి సైలెంట్ అవ్వొచ్చుకదా అంటూ ఉచిత సలహాలు కూడా మెగా స్టార్ కి పెరిగాయి.